– కుల గణన సర్వే చేపట్టిన కాంగ్రెస్ ప్రభుత్వం
– మంత్రి కొండా సురేఖమ్మను మర్యాదపూర్వకంగా కలిసి హార్షం వ్యక్తం చేసిన వేముల మహేందర్ గౌడ్
మొగుళ్ళపల్లి నేటి ధాత్రి
సమగ్ర కుల గణనతోనే బీసీలకు న్యాయం జరుగుతుందని భావించిన కాంగ్రెస్ పార్టీ అధిష్టానం నిర్ణయం మేరకు తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం కుల గణన సర్వే చేపడుతుందని, దీంతో బీసీ కులస్తుల లెక్కలను తేల్చి రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్లను పెంచడానికి సీఎం రేవంత్ రెడ్డి కృషి చేస్తున్న సందర్భంలో బీసీ సంక్షేమ సంఘం జయశంకర్ భూపాలపల్లి జిల్లా అధ్యక్షుడు వేముల మహేందర్ గౌడ్ సోమవారం అటవీ, పర్యావరణ, దేవాదాయ, ధర్మాదాయ శాఖ మంత్రివర్యులు కొండా సురేఖమ్మను వరంగల్ లోని ఓ సిటీ క్యాంప్ కార్యాలయంలో మర్యాదపూర్వకంగా కలిసి..పుష్పగుచ్చం అందించి..బీసీల పట్ల కాంగ్రెస్ ప్రభుత్వం సానుకూలంగా ఉన్నందున ఆయన హార్షం వ్యక్తం చేశారు.ఈ సందర్భంగా వేముల మహేందర్ గౌడ్ మాట్లాడారు. స్వాతంత్ర్యం సిద్ధించినప్పటి నుంచి బీసీలకు రిజర్వేషన్లు లేని కారణంగా అణచివేతకు గురయ్యారని,అందుకే కాంగ్రెస్ ప్రభుత్వం బీసీల లెక్కలను తేల్చి వారికి రాజకీయ, ఆర్థిక, ఉద్యోగ, విద్యా, ఉపాధి అవకాశాలలో రిజర్వేషన్లను కల్పించడానికి సదుద్దేశంతో సమగ్ర కుల గణన చేస్తుంటే..బీఆర్ఎస్, బిజెపి పార్టీలు కులగనణను వ్యతిరేకిస్తున్నాయని, కుల గణనను వ్యతిరేకిస్తున్న పార్టీలకు రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో తగిన గుణపాఠం నేర్పుతామని ఆయన హెచ్చరించారు.