
without-providing-water
రైతులకు నీళ్లు ఇవ్వకుండా కేవలం రైతు భీమా ప్రచారం
*రైతులకు నీళ్లు ఇచ్చి ఆదుకుంటామని చెప్పడం లేదు
*బిజెపి జిల్లా అధికార ప్రతినిధి కుందూరు మహేందర్ రెడ్డి
వర్ధన్నపేట( నేటిధాత్రి):
వర్ధన్నపేట నియోజకవర్గం ఎమ్మెల్యే కె. ఆర్. నాగరాజు సోషల్ మీడియాలో ప్రచారం చేసుకుంటూ రైతులందరూ రైతు బీమా పథకం కోసం దరఖాస్తు చేసుకోవాలని కోరుచున్నారు. ఇది చాలా ప్రయోజనకరమైన విషయమని ఇలా తెలియజేసినందుకు రైతులందరి తరపున ధన్యవాదాలు తెలుపుతున్నామని భారతీయ జనతా పార్టీ అధికార ప్రతి నిధి తెలిపారు. కానీ రైతులకు అవసరమైన నీళ్ల గురించి ఎమ్మెల్యే స్పందించకపోవడం చాలా ఆస్యాస్పదంగా ఉందని మహేందర్ రెడ్డి విమర్శించారు. రైతులు చనిపోయిన తర్వాత ఇచ్చే రైతు బీమా కంటే రైతుల జీవితాలు ఎంతో విలువైనవని ఎమ్మెల్యే ఆలోచించకపోవడం విడ్డూరంగా ఉందని అన్నారు. రైతులు రోడ్లు ఎక్కి ధర్నాలు చేస్తా ఉంటే ఎమ్మెల్యే ఇప్పటికీ స్పందించి అధికారులను పురమాయించి నీళ్లు వచ్చే విధంగా పనిచేయకపోవడం కాంగ్రెస్ ప్రభుత్వానికి మరియు ఎమ్మెల్యే పనితీరుకు అద్దం పడుతుందని ఇప్పటికైనా ఎమ్మెల్యే మేల్కొని దేవాదుల ప్రాజెక్టు కాలువల ద్వారా నీళ్లు నియోజకవర్గం లోని అన్ని చెరువులను నింపే విధంగా పనిచేయాలని యుద్ధ ప్రతిపాదికన పనులు చేపట్టి రైతులకు న్యాయం చేయాలని లేదంటే రైతులు లక్షల రూపాయలు వెచ్చించి వేసుకున్న పంటలు ఎండిపోయే పరిస్థితి ఏర్పడిందని వెంటనే ప్రభుత్వం స్పందించాలని మహేందర్ రెడ్డి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. లేదంటే అతి త్వరలోనే ఎమ్మెల్యే ఇంటి ముట్టడి కార్యక్రమం రైతుల ఆధ్వర్యంలో భారతీయ జనతా పార్టీ సహకారంతో జరుగుతుందని హెచ్చరించారు.