జెడ్పిటిసి గొర్రె సాగర్.
చిట్యాల, నేటి ధాత్రి :
జయశంకర్ భూపాలపల్లి జిల్లా చిట్యాల మండలంలోని చైన్ పాక గ్రామంలో బుధవారం రోజున డబుల్ బెడ్ రూమ్ లబ్ధిదారుల సమక్షంలో జడ్పిటిసి గొర్రె సాగర్ మాట్లాడుతూ రాజకీయాల లబ్ధి కోసం, నిజనిరూపణ లేని అవాస్తవాలను సృష్టించి రాజకీయ పబ్బం గడుపుతున్నారని అన్నారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ చైన్ పాక గ్రామంలో నిరుపేదలైన 20 మంది లబ్ధిదారులకు డబుల్ బెడ్ రూమ్లు మంజూరయ్యాయి. ఎమ్మెల్యేగా గండ్ర వెంకటరమణారెడ్డి సహకారంతో మంజూరైన డబుల్ బెడ్ రూమ్ ఇళ్ల నిర్మాణానికి శ్రీకారం చుట్టడం జరిగింది.గ్రామస్తుల కోరిక మేరకు స్పీకర్ మధుసూదనాచారి హయంలో మంజూరైన డబుల్ బెడ్ రూమ్ ఇల్లులు గత ఎమ్మెల్యే రమణారెడ్డి పిరియడ్ కాలవ్యవధిలో గృహ నిర్మాణ వస్తువులు పెరగడం వలన కాంట్రాక్టర్, గ్రామ లబ్ధిదారులు కలిసి చేసుకునే ఒప్పందం ప్రకారం.1లక్ష రూపాయలు అదనంగా చెల్లిస్తే కట్టిస్తే ఇస్తానని కాంట్రాక్టర్ అన్నారు. కానీ కొంతమంది రాజకీయ లబ్ధి కొరకు రానున్న స్థానిక సంస్థల ఎన్నికలకోసం జడ్పిటిసి గొర్రె సాగర్ పై బురద జల్లి రాజకీయాలు చేస్తున్నారని అన్నారు. నిజమైన వాస్తవాలను నిరూపించి వార్తలను ప్రచురించాలని అవాస్తవాలను ప్రచారం చేసి పూట గడుపుకునే వారు ఇదేమి జర్నలిజం అని ప్రశ్నించారు. ఇండ్ల మంజూరు ఆన్లైన్లో లేవని, అక్రమంగానే డబ్బులు వసూలు చేశారని వచ్చిన ఆరోపణలు అవాస్తవమని, గ్రామస్తుల కోరిక మేరకు అవాస్తవమైన వార్త ప్రచురణ కావడంతో విచారణకు నేను సిద్ధమని సవాల్ విసిరారు.
ఏమి తెలియని అమాయక ప్రజలను నా పైన ఉసిగొలిపి అవాస్తవ వార్తలను ప్రచురించడం సరికాదని, పరువు దావ నష్టం కింద ఫిర్యాదులు చేస్తానని అన్నారు, అలాగే లబ్ధిదారులకు ఇల్ల నిర్మాణం ఈ ప్రభుత్వం పూర్తి చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంల పిఎసి ఎస్ చైర్మన్ కుంభం క్రాంతి కుమార్ రెడ్డి,ఎంపీటీసీ భూక్యా సుజాత రాజు నాయక్ , జంబల తిరుపతి మండల నాయకులు కూర మహిపాల్ రెడ్డి క ర్రే అశోక్ రెడ్డి, పుట్టపాక మహేందర్, పువ్వాటి వెంకన్న పిట్ట సురేష్, లావుడియా రాజు నాయక్, బానోత్ శ్రీనునాయక్, భూక్యా మోహన్, కసర్ల దేవేందర్, దాసరి తిరుపతి బోగం అశోక్, పల్లె శశిధర్ రెడ్డి, దమేర రాజు, దరవత్ రాజు, నాయక్ రాకేష్, బొజ్జపెల్లి వినోద్, శ్రీను తదితరులు పాల్గొన్నారు.