అక్షర హైస్కూల్ లో న్యాయ విజ్ఞాన సదస్సు

రామడుగు, నేటిధాత్రి:

కరీంనగర్ జిల్లా రామడుగు మండలం గుండి గ్రామంలోని అక్షర హైస్కూల్ ఆధ్వర్యంలో న్యాయ విజ్ఞాన సదస్సు కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఈకార్యక్రమానికి ముఖ్య అతిథిగా కరీంనగర్ జిల్లా ప్రధాన న్యాయమూర్తి బి.ప్రతిమ హాజరై విద్యార్థులు ఉన్నతమైన స్థానాలకు చేరుకోవాలని తల్లిదండ్రులు, ఉపాద్యాయులు చెప్పిన మార్గాలను అనుసరించి ముందుకు సాగాలని, చిన్న వయసులోనే లక్ష్యాలను ఏర్పాటు చేసుకుని నిరంతరం వాటి కోసం కృషి చేయాలని, సాంఘిక మద్యమాలకు దూరంగా వుండాలని, వాటిని ఉపయోగించడం వల్ల జీవితంలో విలువైన సమయం వృద అయిపోతుందని, గృహహింస, వరకట్నం, ఆన్లైన్ నేరాలపైన అవగాహన కలిగి ఉండాలని, ఆడపిల్లలు సామాజిక మాధ్యమాల్లో ఫొటోస్ గానీ వీడియోస్ గానీ పెట్టకూడదని, ఏదైనా సమస్యలు వస్తే పోలీస్ వారిని సంప్రదించాలని, సమాజంలో ఆడపిల్లలు ఆర్థికంగా ఎదగాలని, వరకట్నం ఇవ్వడం తీసుకోవడం నేరమని వరకట్న నిర్మూలనకు భావితరాలు కృషి చేయాలని, పిల్లలు ఆరోగ్యాన్ని కాపాడుకోవాలి, మీక్రమశిక్షణే మిమ్మలను జీవితం ఉన్నతమైన శిఖరాలకు చేరవేస్తుందని సూచించారు. ఈకార్యక్రమం సందర్భంగా నిర్వహించిన వ్యాసరచన పోటీల్లో విజేతలుగా నిలిచిన అన్ని పాఠశాలల విద్యార్థులకు బహుమతులు ప్రధానం చేశారు. కరీంనగర్ న్యాయ సేవ అధికార సంస్థ కార్యదర్శి, సీనియర్ సివిల్ జడ్జి కే.వెంకటేష్ మాట్లాడుతూ న్యాయ సేవదికార సంస్థను గ్రామీణ ప్రజలు వినియోగించుకోవాలని సూచిస్తూ, నూతన చట్టాల గురించి వివరించారు. ఈకార్యక్రమంలో చొప్పదండి సిఐ జీ.రవీందర్, రామడుగు ఎస్ఐ నేరెళ్ళ రమేష్ గౌడ్, గ్రామసర్పంచ్ గుండి మానస, కరీంనగర్ న్యాయవాదులు, అల్ఫోర్స్, శ్రీప్రగతి, జడ్పీహెచ్ఎస్ గోపాలరావుపేట, గుండి విద్యార్థులు, ఉపాద్యాయులు, గ్రామప్రజలు, తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!