జున్నుతుల మధుకర్ రెడ్డి జన్మదిన వేడుకలు
శ్రీ సీతారామచంద్రస్వామి దేవస్థానం ధర్మకర్త
వీణవంక ( కరీంనగర్ జిల్లా) నేటి ధాత్రి:
వీణవంక మండల కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు జున్నుతుల మధుకర్ రెడ్డి 43వ జన్మదిన వేడుకలు వీణవంక మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు ఎక్కటి రఘపాల్ రెడ్డి, ఎండీ సాహెబ్ హుస్సేన్ ఆధ్వర్యంలో కేక్ కట్ చేసి స్వీట్స్ పండ్లు పంపిణీ చేయడం జరిగింది
అనంతరం మండల అధ్యక్షుడు రఘపాల్ రెడ్డి ఎండి సాహెబ్ హుస్సేన్ లు మాట్లాడుతూ, కార్యకర్త స్థాయి నుండి ధర్మ కర్త గా ఎదిగి ముందు ముందు మరెన్నో పదవులను పొందాలని వారు ఇలాంటి జన్మదిన వేడుకలు మరెన్నో జరుపుకోవాలని ఆ భగవంతుడు నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలతో ఉంచాలని వీణవంక మండల కాంగ్రెస్ పార్టీ పక్షాన కోరుతున్నాము అన్నారు
ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు ఎక్కటి రఘపాల్ రెడ్డి, మాజీ అధ్యక్షులు ఎండీ సాహెబ్ హుస్సేన్,గంగాడి రాజిరెడ్డి, మాజీ సర్పంచ్ లు చిన్నాల అయిలయ్య, మార్కెట్ డైరెక్టర్ మాదాసు సునీల్,కర్ర తిరుపతి రెడ్డి, నాయకులు ఈదునూరి పైడి కుమార్,ఒరేం శ్రీనివాస్, ఉయ్యాల నాగరాజు,కర్ర గురు,మర్రి సమ్మయ్య తదితరులు పాలుగోన్నారు.