సిఐటియు జిల్లా జాయింట్ సెక్రెటరీ ఆకుదారి రమేష్ పిలుపు.
భూపాలపల్లి నేటిధాత్రి
కేంద్రంలోని బిజెపి ప్రభుత్వం మూడోసారి అధికారంలోకి వచ్చింది. గత పది ఏళ్లుగా సాగించిన సంస్కరణలు ప్రైవేటీకరణ విధానాలను వేగవంతంగా అమలు చేసేందుకు మళ్లీ హువిల్లూరుతున్నది.ఎన్నికల ఫలితాలు వెలువడిన వెంటనే నాలుగు లేబర్ కోడులను అమలు చేస్తామని బిజెపి ప్రభుత్వం ప్రకటించింది. బొగ్గు బ్లాకుల వేలానికి పూనుకున్నది. ఈపీఎఫ్ సకాలంలో చెల్లించని యాజమాన్యాలకు విధించే జరిమానాలను భారీగా తగ్గించింది.కార్పొరేట్ మతోన్మాదులను ప్రసన్నం చేసుకొని వారికి లాభాలు కట్టబట్టేందుకు నిశ్చయంగా ఉంది. కేంద్ర బిజెపి విధానాలను నివారించే కార్మిక హక్కులను కాపాడేందుకు దేశవ్యాప్తంగా కార్మిక పోరాటాలను ఉధృతం చేయాలని సిఐటియు అఖిల భారత కమిటీ నిర్ణయించింది.
దేశవ్యాప్తంగా 2024 జులై 10న “కార్మికుల కోరికల దినం” పాటించాలని సిఐటియు పిలుపునిచ్చింది. ఈ కార్యక్రమంలో సిఐటియు నాయకులు వెలిసెట్ రాజయ్య మేకల మహేందర్ రాజేందర్ నరేష్ తదితరులు పాల్గొన్నారు