Naveen Yadav Invited to Kohir Urs
కోహిర్ ఉర్స్ వేడుకల్లో పాల్గొంటున్న జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే నవీన్ యాదవ్
◆:- కొత్తగా ఎన్నికైన జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే నవీన్ యాదవ్ కు ఆహ్వానం అందజేత
జహీరాబాద్ నేటి ధాత్రి:
కోహిర్.దర్గా కమిటీ అధ్యక్షుడు కోహిర్ మండల పరిషత్ మాజీ చైర్మన్ ముహమ్మద్ షౌకత్ అలీ నేతృత్వంలోని ఉర్స్ అడ్మినిస్ట్రేటివ్ కమిటీ కోహిర్, కోహిర్ నుండి ఒక ప్రతినిధి బృందంగా హైదరాబాద్ కు బయలుదేరి, కొత్తగా ఎన్నికైన జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే నవీన్ కుమార్ యాదవ్ నివాసం ఉన్న యూసుఫ్ గౌడకు చేరుకున్నారు. వారు ఆయనను కలిసి జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో ఆయన అద్భుతమైన విజయం సాధించినందుకు పుష్పగుచ్ఛం అందజేసి, శాలువా కప్పి అభినందించారు. ఈ నెల డిసెంబర్ 7, 8, 9 తేదీల్లో జరుపుకునే హజ్రత్ మౌలానా ముయీజుద్దీన్ చిష్తి తుర్కి ( ఆర్ఏ ) కోహిర్ 767వ వార్షిక మూడు రోజుల ఉర్స్ వేడుకల్లో పాల్గొనేందుకు ఆహ్వానం కూడా అందజేశారు. దీనికి ఎమ్మెల్యే జూబ్లీహిల్స్ నవీన్ కుమార్ యాదవ్ సానుకూలంగా స్పందించి కోహిర్ ఉర్స్ వేడుకలో పాల్గొనేందుకు అంగీకరించారు. ఈ సందర్భంగా కోహిర్ మండల ప్రజా పరిషత్ మాజీ వైస్ చైర్మన్ ముహమ్మద్ షాకిర్ అలీ, జీహెచ్ఎంసీ ఎరగడ డివిజన్ ప్రతినిధి కార్పొరేటర్ ముహమ్మద్ అజార్, ముహమ్మద్ ఇజాజ్ భండారి, ముహమ్మద్ జావేద్ తదితరులు పాల్గొన్నారు.
