గీత కార్మికులకు సేఫ్టీ మోకుల పంపిణీ పట్ల హర్షం

నల్లగొండ జిల్లా, నేటి ధాత్రి:
కల్లుగీత వృత్తిలో ప్రమాద నివారణకు సేఫ్టీ మోకులు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రభుత్వం పంపిణీ చేయడం తెలంగాణ కల్లుగీత కార్మిక సంఘం జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు కొండ వెంకన్న, చౌగాని సీతారాములు హర్షం వ్యక్తం చేశారు.సోమవారంనల్లగొండ జిల్లా కేంద్రంలోని దొడ్డి కొమరయ్య భవనంలో తెలంగాణ కల్లుగీత కార్మిక సంఘం జిల్లా ఆఫీస్ బేరర్స్ సమావేశం జరిగింది. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, కల్లుగీత వృత్తిలో సంవత్సరానికి500 మందికి పైగాతాడిచెట్లపైనుండిపడి చనిపోవడం, వికలాంగులవడం జరుగుతుందన్నారు. వీటి నివారణకు ప్రభుత్వం తగిన చర్యలు తీసుకోవాలని గత అనేక సంవత్సరాలుగా కల్లుగీత కార్మిక సంఘం ప్రభుత్వాలకు విన్నవిస్తూ వస్తుందని 2022 అక్టోబర్ 21న కల్లుగీత కార్మిక సంఘం రాష్ట్ర మహాసభల సందర్భంగా యాదగిరిగుట్టలో బీసీ సంక్షేమ శాఖ ప్రిన్సిపల్ సెక్రెటరీ బుర్రా వెంకటేశం చొరవతో రూపొందించిన సేఫ్టీ మొకు డెమో ఇప్పించడం జరిగిందనివారన్నారు. కల్లుగీత కార్మిక సంఘం చేసిన సూచనల తో రూపుదిద్దుకున్న సేఫ్టీ మోకు లను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పరిశీలించి పంపిణీ చేశారనివారన్నారు. రాష్ట్రంలో ఐదు లక్షల కుటుంబాలు గీత వృత్తిపైనే జీవిస్తున్నారని,సంవత్సరానికి సుమారు 550 మంది చెట్టు పైనుండి జారి పడుతున్నారని వారు ఆవేదన వ్యక్తం చేశారు. గీత కార్మికులకు ప్రస్తుతం పెన్షన్ ఎలాంటి షరతులు లేకుండా 50 సంవత్సరాలు నిండిన ప్రతి గీత కార్మికునికి చేయూత పథకం ద్వారా 4000 ఇవ్వాలని వారు రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరారు.సర్దార్ సర్వాయి పాపన్న విగ్రహాన్ని ఆగస్టు 18 లోపు ట్యాంక్ బండ్ పై నిర్మించాలని వారు ప్రభుత్వాన్ని కోరారు. రాష్ట్ర బడ్జెట్లోగీత కార్మికుల కోసం 5000 కోట్లు కేటాయించాలని,టాడి కార్పొరేషన్ సమర్థవంతంగానిర్వహించాలన్నారు. ప్రభుత్వం నుఅందుకు కృషిచేసిన బీసీ సంక్షేమ శాఖ ప్రిన్సిపల్ సెక్రెటరీ బూర్రా వెంకటేశం,మంత్రి పొన్నం ప్రభాకర్, ఎక్సైజ్ శాఖ మంత్రిజూపల్లి కృష్ణారావు, టాడి కార్పొరేషన్ అధికారులకు ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలిపారు.ఈ కార్యక్రమంలో తెలంగాణ కల్లుగీత కార్మిక సంఘం జిల్లా గౌరవ అధ్యక్షులుపామనగుల్ల అచ్చాలు,జిల్లా ఉపాధ్యక్షులుఉప్పల గోపాల్,కొప్పుల అంజయ్య, జిల్లా సహాయ కార్యదర్శిలు మక్తాల లింగస్వామి, జెర్రిపోతుల ధనుంజయ గౌడ్,జిల్లా కమిటీ సభ్యులు నేలపట్ల నరసింహ,జినుకుంట్ల స్వామి,దండంపల్లి సైదులు,నాగేష్,పంతంగి శ్రీను,మారయ్యతదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!