Celebration Over Three Children GO Cancellation
ముగ్గురు పిల్లల జీవో రద్దు పై హర్షం.
సీఎం ఎమ్మెల్యే చిత్రపటానికి పాలాభిషేకం.
చిట్యాల, నేటిదాత్రి :
చిట్యాల మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు గూట్ల తిరుపతి ఆధ్వర్యంలో శుక్రవారం రోజున అంబేద్కర్ చౌరస్తాలో *సీఎం రేవంత్ రెడ్డి మరియు ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు చిత్రపటానికి పాలాభిషేకం చేయడం జరిగింది. ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి మండల పార్టీ అధ్యక్షులు గూట్ల తిరుపతి మరియు జిల్లా కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి దొడ్డి కిష్టయ్య మాట్లాడుతూ గత 30 సంవత్సరాల నుండి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఉన్నప్పుడు 1995లో నారా చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి గా ఉన్నప్పుడు ముగ్గురు పిల్లలు సంతానం ఉంటే స్థానిక సంస్థలలో పోటీ చేయుట అనర్హులని జీవో తీసుకువచ్చినప్పటి నుండి ముగ్గురు సంతానం కలిగిన వారు రాజకీయానికి దూరంగా ఉన్నారు,సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన క్యాబినెట్ కమిటీ సమావేశంలో కాంగ్రెస్ ప్రభుత్వం ముగ్గురు పిల్లలుంటే పోటీకి అర్హులని మన రాష్ట్ర ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి ముగ్గురు పిల్లల జీవోను రద్దుచేసి ఇద్దరి కంటే ఎక్కువగా పిల్లలున్న ఉన్న వారు స్థానిక సంస్థల్లో పోటీ చేయొచ్చని ప్రభుత్వం మంత్రివర్గ సమావేశంలో నిర్ణయం తీసుకోవడంతో…..
ఈ రాష్ట్రంలో ఇద్దరు కంటే ఎక్కువగా పిల్లలు సంతానం ఉన్న వారు స్థానిక సంస్థల్లో పోటీకి అర్హులని జీవోను తీసుకొచ్చిన ముఖ్యమంత్రి కి మరియు మన నియోజకవర్గ ఎమ్మెల్యే గౌరవనీయులు పెద్దలు గండ్ర సత్యనారాయణ రావు చిత్రపటాలకుశుక్రవారం రోజున పాలాభిషేకం చేయడం జరిగింది. ఈ జీవోను తీసుకొచ్చినటువంటి స్థానిక ఎమ్మెల్యే మరియు ముఖ్యమంత్రివర్యులకి ధన్యవాదాలు కృతజ్ఞతలు తెలియజేయడం జరిగినది.
ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ ఎస్సీ డిపార్ట్మెంట్ స్టేట్ కన్వీనర్ రమేష్, జిల్లా నాయకులు రాజేష్ ఖన్నా, చిట్యాల వ్యవసాయ మార్కెట్ కమిటీ డైరెక్టర్ మట్టికే రవీందర్, నల్లబెల్లి విజేందర్ ,సీనియర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు సిరిపురం కుమారస్వామి కొర్రి సాంబశివుడు ,మండల పార్టీ ప్రధాన కార్యదర్శి గడ్డం కొమురయ్య, గుండె పు రెడ్డి రవీందర్ రెడ్డి, బీసీ సెల్ మండల అధ్యక్షులు, బుర్ర శ్రీనివాస్ గౌడ్, దేవేందర్ రావు ,బొమ్మ కిరణ్ తదితరులు పాల్గొన్నారు.
