వనపర్తి నేటిదాత్రి :
జిల్లా కేంద్రంలో ఇటీవల సీనియర్ జర్నలిస్ట్ పోలిశెట్టి బాలకృష్ణ, నేటి ధాత్రి దినపత్రిక జిల్లా విలేకరి పోలిశెట్టి సురేష్ ల మాతృ మూర్తి సులోచనమ్మ ఆకస్మికంగా మృతి చెందారు. ఈ విషయం తెలుసుకున్న సీనియర్ పాత్రికేయులు జయ ప్రకాష్, సాక్షి జిల్లా ఇంచార్జి. బోలెమోని రమేష్,ప్రజా జ్యోతి జిల్లా ప్రతినిధి బి. లక్ష్మణ్, ఎన్ టి వి అంజి, 3 టి వి అశోక్ రెడ్డి, అమ్మ న్యూస్. ఈశ్వర్, జై తెలంగాణ. రాము, ప్రజా పక్షం డివిజన్ ఇంచార్జి. ఆంజనేయులు, వై కే రమేష్, నినాదం జిల్లా విలేకరి కొంతం రాజేందర్ పరామర్శించారు. మృతి పట్ల కుటుంబ సభ్యులకు ప్రగాఢ సంతాపం వ్యక్తం చేశారు.కుటుంబానికి ఎల్లవేళలా జర్నలిస్టుల తరుపున అండగా ఉంటామని వెల్లడించారు.
