-భద్రాచలం పట్టణ సర్కిల్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ నాగరాజు రెడ్డి
భద్రాచలం నేటి ధాత్రి
జర్నలిస్టులు తమ వృత్తి లోఅంకితభావంతో పనిచేయాలని భద్రాచలం పట్టణ సిఐ నాగరాజు రెడ్డి అన్నారు… భద్రాచలం జర్నలిస్ట్ ఫారం ఆఫ్ భద్రాద్రి ప్రెస్ క్లబ్ క్యాలెండర్ ను భద్రాచలం పట్టణ సి.ఐ నాగరాజు రెడ్డి చేతుల మీదుగా శుక్రవారం ఆవిష్కరించారు.. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ భారతదేశంలో రాజ్యాంగం చట్టబద్ధత కల్పించిన రోజు నేపథ్యంలో ముందుగా అధికారులకు, అనధికారులకు, ప్రజలకు పాత్రికేయులకు 75వ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు… ప్రజాస్వామ్య దేశంలో జర్నలిస్టులు కళ్ళు, చెవుల వంటి వారని కనుక పాత్రికేయులు తమ వృత్తిలో అంకితభావంతో పనిచేసి మంచి పేరు తెచ్చుకోవాలని ఆయన సూచించారు… ప్రజలకు, ప్రభుత్వాలకు మధ్య రథసారథిగా ఉంటూ గ్రామాల్లో పేరుకుపోయిన ప్రజా సమస్యల ను ప్రభుత్వాలకు చేరవేసి, అక్కడనుండి ప్రజలకు చేరవేసి పరిష్కరించే దిశలో మీడియా పోషించే పాత్ర ఎంతో అమోఘమైనది అని ఆయన కొనియాడారు… నిత్యము వార్త సేకరణలో నిమగ్నమై ఉండే పాత్రికేయులు యదార్థ కథనాలను వ్రాసి ప్రజలకు, అందించాలని ఆయన కోరారు.. జర్నలిస్ట్ ఫోరం ఆఫ్ భద్రాద్రి ప్రెస్ క్లబ్, రానున్న రోజుల్లో మంచి పేరు తెచ్చుకొని భవిష్యత్తులో ఉన్నతమైన స్థానంలో నిలవాలని. ప్రెస్ క్లబ్ సభ్యులు వారి వృత్తిలో నైపుణ్యతను పెంచుకోవాలని, ప్రజాస్వామ్య దేశంలో పాత్రికేయులుగా రాణించాలంటే పట్టుదల అంకిత భావం ఉండాలని ఆయన సూచించారు… ఈ కార్యక్రమంలో అధ్యక్షుడు బొడ్డు ఆనంద్ , సెక్రెటరీ జోసెఫ్ , ట్రెజరీ అనిల్ , ప్రెస్ క్లబ్ పి.ఆర్.వో మదార్ , తదితరులు పాల్గొన్నారు….