పేరు పెద్ద వూరు దిబ్బగ జర్నలిస్టుల జీవితాలు.
ఫోర్త్ ఎస్టేట్ గా ఉన్న మీడియా విలేకరులకు అండగా ఉండండి..
మల్కాజిగిరి
రాజ్యాంగంలో నాలుగవ ఎస్టేట్ గా చెప్పబడుతున్న మీడియాలో పనిచేస్తూ రాజకీయ పార్టీలకు,ప్రజలకు వారధిగా ఉన్న జర్నలిస్టుల బ్రతుకుల జీవితాలు అగమ్యగోచరంగా మారింది అనడంలో ఏటువంటి సందేహం లేదు.లైఫ్ గ్యారెంటీ,జాబ్ గ్యారెంటీ లేని బ్రతుకులు జర్నలిస్టులవి.సమాజంలో జర్నలిస్టులు కూడా ఓటర్లు అని,అన్ని ప్రధాన పార్టీలు గ్రహించాలి.కావున అన్ని రాజకీయ పార్టీల అధ్యక్షులకు,మేము మల్కాజ్గిరి వర్కింగ్ జర్నలిస్టులుగా మీకు విన్నవించుచునది ఏమనగా తెలంగాణ రాష్ట్రంలో రైతులకు,వృద్ధులకు,బీడీ కార్మికులకు, పద్మశాలీలకు,గౌడ్స్ కు పెన్షన్,ఇస్తున్న మీరు,ఇప్పుడు నూతనంగా మరికొన్ని పథకాలకు రూపకల్పన చేస్తున్న అన్ని పార్టీల అధ్యక్షులకు కోరుతున్నది ఏమనగా,సమాజంలో లైఫ్ గ్యారెంటీ, లేని వర్కింగ్ జర్నలిస్టులఅందరి కోసం, ఎందుకు అన్ని పార్టీలో ఉన్న అధ్యక్షులు ఆలోచించడం లేదు.2023 సాధారణ ఎలక్షన్స్ మేనిఫెస్టోలో తెలంగాణ వ్యాప్తంగా పనిచేస్తున్న వర్కింగ్ జర్నలిస్టులందరికీ పెన్షన్ రూపేనా,గౌరవ వేతనం రూపేనా ఏదో ఒక పథకాన్ని జర్నలిస్టుల కోసం ప్రవేశపెట్టి మేనిఫెస్టోలో జర్నలిస్టులభృతి పదకన్ని ప్రవేశపెట్ట వలసిందిగా మా విన్నపం.అన్నీ పార్టీలు చేస్తున్న మంచి,సమాజంలో జరుగుతున్న మంచి,చెడులను ప్రజలకు చేరవేస్తున్న విలేకరుల కోసం అన్ని పార్టీల అధ్యక్షులు ఆలోచించకపోవడం బాధాకరం.ఇప్పటికైనా అన్ని పార్టీల అధ్యక్షులను కోరుతున్నది ఏమనగా, తెలంగాణ వ్యాప్తంగా ఉన్న వర్కింగ్ జర్నలిస్టులందరికీ జర్నలిస్టులభృతి అందించాలని కోరుతున్నాము.