వరంగల్ తూర్పు జర్నలిస్టులకు వెంటనే డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు ఇవ్వాలి.
బీజేపీ వరంగల్ జిల్లా అధ్యక్షులు గంట రవికుమార్.
వరంగల్, నేటిధాత్రి
భారతీయ జనతా పార్టీ వరంగల్ జిల్లా అధ్యక్షులు గంట రవికుమార్ ఆధ్వర్యంలో జిల్లా అధికార ప్రతినిధి ఆడేపు వెంకటేష్ అధ్యక్షతన బుధవారం నాడు ఏకశిలా పార్క్ బాలసముద్రం వద్ద వరంగల్ తూర్పు జర్నలిస్టుల డబుల్ బెడ్ రూమ్ కొరకై మహాధర్నా కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్బంగా వారు మాట్లాడుతూ… తెలంగాణ రాష్ట్ర సాధన పోరాటంలో ముందుండి పోరాడిన జర్నలిస్టులకు డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు ఇవ్వకపోవడం సిగ్గుచేటు. జర్నలిస్టుల సమస్యలు పరిష్కరించాలని డబుల్ బెడ్ రూమ్ ఇవ్వాలని కోరుతూ దేశాయిపేట ఇండ్ల ముందు నిరాహార దీక్ష చేపట్టిన వారికి మద్దతుగా బీజేపీ మద్దతు ప్రకటించి ఈరోజు ఇళ్ల స్థలాలు, ఇల్లు మంజూరు చేయాలనీ ఎన్నో ఏళ్లుగా ఎదురుచూస్తున్న తమ కలలను నిజం చేస్తూ డబుల్ బెడ్ రూమ్ లను గత బిఅర్ఎస్ కేటాయించినా ఇండ్లు ఇవ్వలేకపోయారు. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి ఇన్ని రోజులు కావస్తున్న జర్నలిస్టులకు నీడ లేకపోయిందని విమర్శించారు.

ప్రభుత్వానికి, ప్రజలకు ప్రతినిధులగా వారి మధ్య జరిగే సమాచారాన్ని తెలియపర్చే వారు జర్నలిస్టులు. వారికి పేపర్ సంస్థ నుండి చాలీచాలని వేతనాలతో కుటుంబంతో జీవనాన్ని గడుపుతున్నారు. ఇంటి అద్దె కట్టలేక నాన అవస్థలు పడుతూ కుటుంబాన్ని పోషిస్తున్నారు.
అప్పుడున్న రాజకీయ పరిణామాలు ప్రభుత్వం పటిష్టమైన చర్యలు తీసుకోకపోవడం వలన లబ్ధిదారులను ఎంపిక చేయడంలో పూర్తిగా విఫలమయ్యారు.
ప్రభుత్వాలు ఏవి ఉన్నా జర్నలిస్టులను వాడుకోవడం, ప్రభుత్వం పోయాక మళ్ళీ వచ్చిన ప్రభుత్వం అదే తరహా జర్నలిస్టులను వాడుకుంటూ, గత ప్రభుత్వాల మాదిరిగానే చేస్తూ ఉండడం అనవాయితిగా మారింది. ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి 18 నెలలు గడుస్తున్న గత ప్రభుత్వం చేసిన తప్పులనే ఈ ప్రభుత్వం చేస్తోంది.
ఇప్పడి లబ్ధి దారులకు ఇండ్లు ఇయ్యక పొవడం వలన శిథిలావస్థకు చేరుతుతున్నాయి. అసాంఘిక కర్యకలాపాలకు అడ్డాగా మారి జూదాలకి, వ్యభిచారులకు ఆశ్రయం ఐపోయి, తలుపులు, కిటికీలు, కరెంటు వైర్లు,నీటి పైపు లైను, ట్యాంకులు అన్ని ధ్వంసం చేశారు.
తూర్పులో శాసనసభ్యులుగా ఉన్న మంత్రి కొండా సురేఖ ఎన్నోసార్లు డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు ల దగ్గర పర్యటించినప్పటికీ జర్నలిస్టులపై అనుకూల భావన లేనట్లు కనిపిస్తుంది.
అదే నిజమైతే గత ప్రభుత్వంలో భూమి కేటాయింపు నిధుల కేటాయింపు శంకుస్థాపన ప్రారంభోత్సవం ఏ రకంగా చేశారు. దీనిని ప్రభుత్వాలు దేనికోసం నిర్మించాయి. సదరు పాలకులు గమనించాలి.
ప్రభుత్వాలు మారినప్పుడల్లా వారికి అనుకూలమైన నిర్ణయాలు తీసుకోవడం సబబేనా అంటూ వరంగల్ తూర్పులో వర్కింగ్ జర్నలిస్టులు నిరాహార దీక్షలు చేపట్టారు.
సమస్య శాంతియుతంగా పరిష్కారం కాకపోతే నగర నడిబొడ్డున తీవ్రస్థాయిలో ఉద్యమిస్తామన్నారు తెలిపారు.
ఇప్పటికైనా ప్రజాపాలన ప్రభుత్వం స్పందించి తూర్పు వర్కింగ్ జర్నలిస్టులకు త్వరగా కేటాయించాలని కోరారు.

12 ఏప్రిల్, 2021 రోజున వరంగల్ తూర్పు జర్నలిస్టుల కోసం డబల్ బెడ్రూంలు భూమి పూజ చేసిన అప్పటి మంత్రివర్యులు కేటీఆర్..
రెండు ఏండ్లలో 12 కోట్లు ఖర్చు పెట్టి, మొత్తం మూడు ఎకరాల భూమిలో, రెండు ఎకరాల్లో మొత్తం 9 బ్లాకులు కలిపి 200 డబల్ బెడ్ రూమ్ ల నిర్మాణం పూర్తి చేసిన అప్పటి తూర్పు ఎమ్మెల్యే నన్నపనేని నరేందర్, తేదీ 17 జూన్, 2023 నాడు నిర్మాణం పూర్తి చేసిన డబల్ బెడ్ రూం లు, అట్టహాసంగా ప్రారంభం చేసి, ఆరుగురు జర్నలిస్టులకు గృహ ప్రవేశం, జర్నలిస్ట్ ల కాలనీ, జర్నలిస్టుల కొరకు అని పేర్కొన్న అప్పటి ప్రభుత్వం.
రెండు ఏండ్లుగా నిరుపయోగంగా ఉండటం వలన చాలా వరకు కిటికీలు, ఎలెక్ట్రిక్ పరికరాలు, డోర్ లు, పైపులు ధ్వంసం అయ్యాయి.
వాటర్ ఇంటెక్స్ ట్యాంక్ లు మాయమయ్యాయి, అసాంఘిక కార్యక్రమాలకు అడ్డాగా మారిన తీరు కనిపిస్తుందని అన్నారు.
వరంగల్ జర్నలిస్ట్ ఐకాస ప్రధాన డిమాండ్లు
అర్హులైన జర్నలిస్టులకు డబుల్ బెడ్ రూమ్ లను కేటాయించాలి.
జర్నలిస్టుల హెల్త్ స్కీమ్ ( జేహెచ్ఎస్) పరిమితి రెండు లక్షల నుండి 10 లక్షలకు పెంచాలి.
అన్ని కార్పొరేట్ ఆసుపత్రుల్లో (జేహెచ్ఎస్) పనిచేయడంతో పాటు అన్ని వ్యాధులకు వర్తింపజేయాలి.
వరంగల్ ప్రెస్ క్లబ్ కు స్థలం కేటాయించాలని, అలాగే పలు డిమాండ్లతో వరంగల్ జిల్లా రెవెన్యూ అధికారికి భారతీయ జనతా పార్టీ జిల్లా శాఖ ఆధ్వర్యంలో మెమొరండం ఇవ్వడం జరిగింది.

ఈ కార్యక్రమంలో వరంగల్ జిల్లా ఎలక్ట్రానిక్ & ప్రింట్ మీడియా మిత్రులు, రాష్ట్ర క్రమశిక్షణ కమిటీ చైర్మన్, మాజీ శాసనసభ్యులు మార్తీనేని ధర్మారావు, మాజీ పార్లమెంట్ సభ్యులు అజ్మీర సీతారాం నాయక్, మాజీ శాసనసభ్యులు వన్నాల శ్రీరాములు, మాజీ శాసనసభ్యులు ఆరూరి రమేష్, మాజీ పూర్వ జిల్లా అధ్యక్షులు చాడ శ్రీనివాసరెడ్డి, బిజెపి రాష్ట్ర కార్యవర్గ సభ్యులు కుసుమ సతీష్ , గురుమూర్తి శివకుమార్, రత్నం సతీష్ షా, వన్నాల వెంకటరమణ, జిల్లా ప్రధాన కార్యదర్శిలు బాకం హరిశంకర్, మల్లాడి తిరుపతిరెడ్డి, డాక్టర్ గోగుల రాణా ప్రతాపరెడ్డి, ఎస్సీ మోర్చా రాష్ట్ర ఉపాధ్యక్షులు బన్న ప్రభాకర్, కార్పొరేటర్ చాడ స్వాతి, కాసు శిల్పా, జిల్లా పదాధికారులు, మండల అధ్యక్షులు, వివిధ మోర్చా నాయకులు, బిజెపి జిల్లా నాయకులు, కార్యకర్తలు, మహిళలు పాల్గొన్నారు.