Journalists Protest Over Pending Housing Sites
రోడ్డుపై పడుకుని నిరసన తెలిపిన జర్నలిస్టులు
భూపాలపల్లి నేటిధాత్రి
జయశంకర్ భూపాలపల్లి జిల్లా కేంద్రంలో జర్నలిస్టులు వినూత్న రీతిలో నిరసన వ్యక్తం చేశారు…పట్టాలిచ్చి స్థలం చూపించడం లేదంటూ జాతీయ రహదారి పై పడుకొని నిరసన తెలియజేశారు..
పట్టాలిచ్చి ఇళ్ల స్థలాలు చూపించడం లేదంటూ భూపాలపల్లి జిల్లా కలెక్టర్ కార్యాలయం ముందు 37 మంది జర్నలిస్టులు చేస్తున్న రిలే నిరాహార దీక్షలు మంగళవారం నాలుగో రోజుకు చేరాయి…ఈ నిరాహార దీక్షలో భాగంగా 5 ఇంక్లైన్ ఆర్చ్ నుండి డప్పు చప్పుళ్ళతో జర్నలిస్టులు ర్యాలీ నిర్వహించారు…పట్టాలిచ్చారు స్థలాలు ఇవ్వడం మరిచారు అంటూ నినాదాలు చేస్తూ ముందుకు నడిచారు…ముందుగా జయశంకర్ సార్ విగ్రహం చుట్టూ ప్రదక్షిణ నిర్వహించి, జయశంకర్ సార్ విగ్రహానికి పట్టాలను ఇచ్చి నిరసన తెలిపారు…
అధికారులు పట్టాలిచ్చి స్థలాలు ఇవ్వకుండా మొద్దు నిద్ర పోతున్నారనీ ఆరోపిస్తూ భూపాలపల్లి జిల్లా కేంద్రంలోని జాతీయ రహదారి పై పడుకొని జర్నలిస్టులు నిరసన తెలిపారు..2 సంవత్సరాలుగా ఇళ్ల స్థలాలు వస్తాయని ఆశతో ఎదురుచూస్తున్నామని ఆవేదన వ్యక్తం చేశారు…ఈ నిరసనకు ప్రజా సంఘాలు, విద్యార్థి సంఘాల నాయకులు మద్దతు తెలిపారు… జర్నలిస్టులు నిరసనతో జాతీయ రహదారి పై భారీగా ట్రాఫిక్ జాం అయింది… అనంతరం అంబేద్కర్ విగ్రహానికి ఇళ్ల పట్టాలను సమర్పించారు… ఇప్పటికైనా జిల్లా కలెక్టర్, ఎమ్మెల్యే స్పందించి 37 మంది జర్నలిస్టులకు ఇళ్ల స్థలాలు చూపించాలన్నారు..లేదంటే ఉద్యమాన్ని ఉదృతం చేస్తామని హెచ్చరించారు…ఈ నిరసనలో ప్రజా సంఘాలు, విద్యార్థి సంఘాలు, కుల సంఘాలు నాయకులు, జిల్లా లో ఉన్న జర్నలిస్టు లు, జర్నలిస్ట్ సంఘాల నాయకులు పాల్గొన్నారు…
