చలో వరంగల్ గోడ పత్రిక ఆవిష్కరణ.
వరంగల్ కేసీఆర్ సభను విజయవంతం చేయండి.గీత
మహాదేవపూర్ -నేటి ధాత్రి:
వరంగల్లో జరిగే మహాసభకు మండల ప్రజలందరూ కదం తొక్కాలని తెలంగాణ రాష్ట్ర ప్రజలకు అందిన ఫలాలు రాష్ట్ర అభివృద్ధి, ప్రస్తుత పరిస్థితుల పై వాస్తవాలను ప్రజల ముందుకు తీసుకురావడం కొరకు తెలంగాణ జాతిపిత కెసిఆర్ సారధ్యంలో నిర్వహించబడునున్న మహాసభకు తరలిరావాలని, మంథని నియోజకవర్గ మహిళా అధ్యక్షురాలు, గీతా బాయ్ అన్నారు. ఈరోజు టిఆర్ఎస్ నాయకులు కార్యకర్తలతో కలిసి చలో వరంగల్ గూడ పత్రికను ఆవిష్కరించడం జరిగింది. అలాగే గూడ పత్రికను పలుచోట్ల గోడలకు అంటించిన అనంతరం, గీతా బాయ్ మండల ప్రజలు పెద్ద సంఖ్యలో సభలో పాల్గొని విజయవంతం చేయాలని కోరడం జరిగింది. ఈ కార్యక్రమంలో, మాజీ ప్రజా ప్రతినిధులు, మహిళా విభాగం నాయకురాళ్లు, టిఆర్ఎస్ యువజన విభాగం, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.