టి పి పి సి ప్రెసిడెంటు ను మరియు టి పి పి సి లీగల్ సెల్ చైర్మన్ ను కలిసిన ఉమ్మడి వరంగల్ జిల్లా లీగల్ సెల్ మెంబెర్స్:-

హనుమకొండ/వరంగల్, నేటిధాత్రి (లీగల్):-

తేది:-04-01-2025 నాడు హనుమకొండ మరియు వరంగల్ లీగల్ సెల్ టీమ్ టి పి పి సి అద్యక్షులు బొమ్మ మహేష్ కుమార్ గౌడ్ గారిని మరియు టి పి పి సి లీగల్ చైర్మన్ పొన్నం అశోక్ గౌడ్ గారిని హైదరాబాద్ లో కలసి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా మహేష్ గౌడ్ గారిని కాంగ్రెస్ పార్టీ న్యాయవాదులకు మేనిఫెస్టో పెట్టిన అంశాలను నెరవేర్చడానికి కృషి చెయ్యాలని కోరారు. అదేవిధంగా టి పి పి సి లీగల్ సెల్ చైర్మన్ పొన్నం అశోక్ గౌడ్ గారిని న్యాయవాదులకు బార్ కౌన్సిల్ ద్వారా ఉన్న ఇన్స్యూరెన్స్ ను రెండు లక్షల నుండి ఇప్పటి పరిస్థితులకు అనుగుణంగా ఉండే విధంగా పెంచాలని బార్ కౌన్సిల్ మెంబెర్స్ పై ఒత్తిడి తీసుకురావాలని, జూనియర్ న్యాయవాదులకు స్టైఫండ్ అందేలా ప్రయత్నం చేయాలని కోరారు. దీనికి వారు ఇట్టి విషయాలను నెరవేర్చడంలో తమ వంతు సహాయసహకారాలు అందిస్తామని హామీ ఇచ్చారన్నారు. వారిని కలిసినవారిలో హనుమకొండ జిల్లా లీగల్ సెల్ టీమ్ మెంబెర్స్ దయాన్ శ్రీనివాసన్, సిద్ధం యుగెందర్, పోషిని రవీందర్, నాగభూషణం, సత్యనారాయణ, సిర్ర రాజు, వరంగల్ లీగల్ సెల్ టీమ్ నుండి కొక్కండ రమేష్, ఇజ్జిగిరి సురేష్, గంప వెంకటరమణ, అమృత రావు, మరియు రాష్ట్ర లీగల్ సెల్ వైస్ ఛైర్మన్ నిమ్మాని శేఖర్ రావు, కన్వీనర్లు ముదాసిర్ అహ్మద్, రంజిత్ గౌడ్ మరియు ఇంకా ఇతర న్యాయవాదులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!