చిట్యాల, నేటి ధాత్రి:
జయశంకర్ భూపాలపల్లి జిల్లా చిట్యాల మండలంలోని వెంచరామి (పురేడు గుట్ట) సమ్మక్క జాతర పనులను మంగళవారం రోజున పరిశీలించిన జిల్లా జాయింట్ కలెక్టర్ . కె. వెంకటేశ్వర్లు, ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జాతర అభివృద్ధి పనులను చూసి భక్తులకు కల్పించిన సౌకర్యాలను చూసి
జాతరకు సర్వం సిద్దం చేసిన
పనులు బాగున్నవి అని
చిట్యాల మండల పరిధిలోని వెంచరామి (పురెడు గుట్ట) వద్ద ఈనెల 21 నుండి 24 వరకు జరిగే సమ్మక్క సారలమ్మ జాతర పనులను జిల్లా జాయింట్ కలెక్టర్ శ్రీ.కె.వెంకటేశ్వర్లు అభినందించారు.కొత్తగా వేసిన రోడు,విద్యుత్తు, మంచినీటి సౌకర్యం,శానిటేషన్ బట్టలు మార్చుకునే గదులు మరియు పార్కింగ్ తదితర పనులను పరిశీలించి పనులు బాగున్నవని అబినందించారు. వారి వెంట ,మండల పరిషత్ అభివృద్ధి అధికారి రామయ్య, మండల పంచాయతీ అధికారి రామకృష్ణ, డిప్యూటీ తహశీల్దార్ శివతేజ పంచాయత్ రాజ్ అసిస్టెంట్ ఇంజనీర్ తిరుపతి, జాతర కమిటీ,పంచాయతి కార్యదర్శి మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు గుట్ల తిరుపతి వర్కింగ్ ప్రెసిడెంట్ మూలశంకర్ గౌడ్ మరియు గ్రామస్తులు తదితరులు ఉన్నారు.