
తంగళ్ళపల్లి నేటి ధాత్రి
తంగళ్ళ పల్లి మండలం నేరెళ్ల గ్రామంలో స్థానిక జెడ్పిటిసి సిరిసిల్ల కాంసెన్సీ ఇన్చార్జి కాంగ్రెస్ పార్టీ కేకే మహేందర్ రెడ్డి ఆధ్వర్యంలో పార్టీలో చేరికలు జరిగాయి ఈ సందర్భంగా ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రాష్ట్రంలోని ప్రజలు నియంత నిరంకుశ పాలనకు చ మ రా పాడి గీతం పాడి ప్రజా పాలన తెచ్చుకున్నారని సోనియా గాంధీ ఇచ్చిన ఆశయాలకు అనుగుణంగా పని చేయాలని రాష్ట్రమస్తే బతుకులు బాగుపడతాయని అనుకున్నామని 7 లక్షల కోట్లు రాష్ట్రాన్ని అప్పుగా తెచ్చారని మిగులు బడ్జెట్ గా ఉన్న రాష్ట్రాన్ని అప్పుగా తెచ్చారని ఇన్ని కోట్లు అప్పు చేసిన ఘనత కేసిఆర్ ప్రభుత్వo. చేసిన ఘనతని ఈ సందర్భంగా తెలియజేశారు. ఇసుక లారీల కింద పేద ప్రజలు చనిపోయిన ఇక్కడి ఎమ్మెల్యే పట్టించుకున్న పాపాన పోలేదని దానిపై పోరాడినదళితుల ఇతర కులాలపై థర్డ్ డిగ్రీ ప్రయోగించి వాళ్ల జీవనోపాధి దెబ్బతీశారని ఈ సందర్భంగా తెలియజేశారు. ముఖ్యంగా సర్పంచులకు బిల్లు ఇవ్వని మీరు సర్పంచుల పక్షాన పోరాడుతామని చెప్పడం మీకే వదిలేస్తున్నామని కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన సందర్భంగా ఆరు గ్యారెంటీ ఇచ్చిందని గుర్తు చేస్తూ ముందు ముందు కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన గ్యారెంటీలను కచ్చితంగా అమలు చేస్తామని ఈ సందర్భంగా తెలియజేశారు ఇట్టి కార్యక్రమంలో ఎంపిటిసి బైరివేని రాము జిల్లా నాయకులు వైద్య శివప్రసాద్ లింగాల భూపతి లింగారెడ్డి తిరుపతిరెడ్డి కృష్ణారెడ్డి శ్రీనివాస్ రెడ్డి మండల నాయకులు గుగ్గిల శ్రీకాంత్ గౌడ్ పొన్నాల పరశురాములు మునిగల రాజు మల్లేష్ యాదవ్ కళ్యాణ్ శ్రీనివాస్ కోల శంకర్ లక్ష్మణ్ మాధవరెడ్డి మహేష్ శీను మీరాల శ్రీను నారాయణ తదితరులు పాల్గొన్నారు