ముఖ్యమంత్రి కేసీఆర్ కొత్తగూడెంపై ప్రత్యేక దృష్టి సారించారు:ఎంపీ రవిచంద్ర
వనమా 3వేల కోట్లతో అభివృద్ధి చేశారు, కేసీఆర్ 6వేల కోట్లు వెచ్చించి గొప్పగా తీర్చిదిద్దుతారు: ఎంపీ రవిచంద్ర
ఓడే దానిలో కాదు,గెలిచే పార్టీలో ఉండాలి: ఎంపీ రవిచంద్ర
బీఆర్ఎస్ గెలుపు ఖాయమైంది, మిగతా వారి డిపాజిట్లు గల్లంతు కావాలి:ఎంపీ రవిచంద్ర
కాంగ్రెస్ పార్టీని వీడి వందమంది యువకులు ఎంపీ రవిచంద్ర సమక్షంలో బీఆర్ఎస్ లో చేరారు
ముఖ్యమంత్రి చంద్రశేఖర రావు కు సీనియర్ శాసనసభ్యులు వనమా వెంకటేశ్వరరావు అన్నా, కొత్తగూడెం నియోజకవర్గం అంటే ప్రత్యేక అభిమానం ఉందని రాజ్యసభ సభ్యులు వద్దిరాజు రవిచంద్ర చెప్పారు.తనకు వనమా అంటే చాలా గౌరవం అని, తెలంగాణ తొలి,మలి దశ ఉద్యమాలలో కీలక పాత్ర పోషించిన కొత్తగూడెంపై అభిమానం ఉందని బహిరంగసభలో కేసీఆర్ చెప్పిన విషయాన్ని ఎంపీ రవిచంద్ర గుర్తు చేశారు.ఎమ్మెల్యే వెంకటేశ్వరరావు నియోజకవర్గాన్ని 3వేల కోట్లతో అభివృద్ధి చేశారని, కేసీఆర్ ప్రత్యేక దృష్టి సారించడంతో 6వేల కోట్లు వెచ్చించి గొప్పగా తీర్చిదిద్దుతారని వివరించారు.కాంగ్రెస్ పార్టీకి చెందిన కలకోటి రాజు నాయకత్వంలో సుమారు వందమంది యువకులు ఎంపీ వద్దిరాజు సమక్షంలో మంగళవారం సాయంత్రం బీఆర్ఎస్ లో చేరారు.కొత్తగూడెం తెలంగాణ భవన్ లో జరిగిన ఈ కార్యక్రమంలో ఎంపీ రవిచంద్ర మాట్లాడుతూ, ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రత్యేక దృష్టి సారించిన ఈ అవకాశాన్ని నియోజకవర్గ ప్రజలు సద్వినియోగం చేసుకోవాల్సిందిగా హితవు పలికారు.ఓడిపోయే దానిలో కాకుండా గెలిచే పార్టీలో ఉంటేనే యువతకు చక్కని భవిష్యత్తు ఉంటుందన్నారు.వనమా గెలుపు ఖాయమైందని, భారీ మెజార్టీ సాధించి ఇతరుల డిపాజిట్లు గల్లంతు చేయడమొక్కటే మిగిలి ఉందన్నారు.కాంగ్రెస్ ను వీడి వచ్చిన వారిలో నరేష్,కన్నా,వెంకట్,నవీన్,శివ నిరంజన్, కార్తీక్,వంశీ తదితరులు ఉన్నారు.ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ నియోజకవర్గ సమన్వయకర్తలు సర్థార్ పుట్టం పురుషోత్తం, బత్తినీడి ఆది విష్ణుమూర్తి,మునిసిపల్ వైస్ ఛైర్మన్ వీ.దామోదర్,నాయకులు భీమా శ్రీధర్, లగడపాటి రమేష్ తదితర ప్రముఖులు పాల్గొన్నారు.