కాంగ్రెస్ పార్టీలో చేరికలు
దేవరకద్ర /నేటి ధాత్రి
మహబూబ్ నగర్ జిల్లా దేవరకద్ర మండలం మినిగోనిపల్లి గ్రామానికి చెందిన బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు, మాజీ సర్పంచ్ వెంకటయ్య, మైబు , శ్రీను, గోవర్ధన్ రెడ్డి , మరియు పెద్ద ఎత్తున బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు, పలువురు బీజేపీ కార్యకర్తలు శుక్రవారం దేవరకద్ర ఎమ్మెల్యే జి. మధుసూదన్ రెడ్డి సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఈ సందర్భంగా వారికి కాంగ్రెస్ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు
అనంతరం వారు మాట్లాడుతూ..కాంగ్రెస్ పార్టీ చేస్తున్న సంక్షేమ పథకాలకు ఆకర్షితులమై ఎమ్మెల్యే జి మధుసూదన్ రెడ్డి సమక్షంలో పార్టీలో చేరామన్నారు. వచ్చే స్థానిక సంస్థలు ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ గెలుపునకు కృషి చేస్తామన్నారు.
