బహుజన సమాజ్ పార్టీలో చేరికలు
బీఎస్పీ పార్టీ జిల్లా అధ్యక్షులు పొన్నం బిక్షపతి గౌడ్
గణపురం నేటి ధాత్రి
గణపురం మండల కేంద్రంలో బహుజన్ సమాజ్ పార్టీలో చేరికలు
ఈ కార్యక్రమానికి బహుజన్ సమాజ్ పార్టీ జిల్లా అధ్యక్షులు పొన్నం బిక్షపతి గౌడ్ అధ్యక్షత వహించగా ముఖ్యఅతిథిగా జిల్లాఇన్చార్జి వేల్పుగొండ మహేందర్ హాజరయ్యారు చేరికలను ఉద్దేశించి పొన్నం బిక్షపతి గౌడ్ మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో 90 శాతం ఉన్న బీసీ ఎస్సీ ఎస్టీ మైనారిటీలు ఏకం అయ్యి బహుజన రాజ్యాధికారానికి అడుగులు వేయాలని అగ్రవర్ణాల పార్టీలు చేస్తున్న రాజకీయ కుట్రలను తిప్పి కొట్టాలని సమాజంలో గౌరవం సమానత్వం పొందాలంటే రాజ్యాధికారమే మార్గమని అన్నారు అదే విధంగా భూపాలపల్లి నియోజకవర్గ ఇన్చార్జిగా మురారి సదానందం భూపాలపల్లి నియోజకవర్గ కోశాధికారిగా జీడి సునీల్ గణపురం మండల అధ్యక్షునిగా ఈర్ల చిన్న మండల ప్రధాన కార్యదర్శిగా జీడి రాజేందర్ ని ఎన్నుకున్నట్లు తెలిపారు ఈ కార్యక్రమంలో జిల్లా ఉపాధ్యక్షులు మేకల ఓంకార్ తదితరులు పాల్గొన్నారు