ఎంపీగా కడియం కావ్య కు భారీ మెజార్టీ ఖాయం
నడికూడ,నేటి ధాత్రి:
వరంగల్ పార్లమెంట్ ఎన్నికల్లో ఎంపీగా కడియం కావ్య గెలవడం ఖాయమని వరంగల్ పార్లమెంట్ ఇంచార్జ్,పరకాల శాసనసభ్యులు రేవూరి ప్రకాష్ రెడ్డి అన్నారు. శుక్రవారం పరకాల నియోజకవర్గం నడికూడ మండల కేంద్రంతో పాటు గొల్లపల్లెకు చెందిన బిఆర్ఎస్, బిజెపి 30 మంది నాయకులు నడికూడ మండల అధ్యక్షుడు బుర్ర దేవేందర్ గౌడ్ ఆధ్వర్యంలో ఎమ్మెల్యే రేవూరి ప్రకాష్ రెడ్డి నివాసంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు.వారికి ఎమ్మెల్యే కాంగ్రెస్ కండువాలు కప్పి ఆహ్వానించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ వరంగల్ పార్లమెంటు ఎన్నికల్లో కాంగ్రెస్ విజయం ఎప్పుడో ఖాయం అయిందని, భారీ మెజార్టీ లక్ష్యంగా ముందుకు వెళ్లాలని కార్యకర్తలకు పిలుపునిచ్చారు. పార్టీలో చేరినవారు నడికూడ మండల ముదిరాజ్ సొసైటీ చైర్మన్ తాళ్ల శ్యామ్ రాజ్ తో సహా 30 మంది నాయకులు కాంగ్రెస్ పార్టీలోకి చేరారు.ఈ కార్యక్రమం లో నడికూడ మండల ప్రధాన కార్యదర్శి కుడ్ల మలహాల్ రావు,గ్రామ కమిటీ అధ్యక్షుడు తాళ్ల నవీన్, మండల మహిళా అధ్యక్షురాలు భోగం కమల, మండల యూత్ అధ్యక్షులు అప్పం కుమారస్వామి, పరకాల బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు ఈర్ల చిన్ని,మండల ఎస్సీ సెల్ ప్రధాన కార్యదర్శి దుప్పటి సదానందం, ఓ బి సి హనుమకొండ జిల్లా కన్వీనర్ బొమ్మ చంద్రమౌళి, సీనియర్ నాయకులు నారగాని కుమార స్వామి, వాంకె రాజయ్య,రావుల సురేష్,గ్రామ సమన్వయ కమిటీ సభ్యురాలు నీరటి రజిత,గ్రామ ప్రధాన కార్యదర్శి జీల శ్రీనివాస్,మండల సమన్వయ కమిటీ సభ్యులు పెద్ద బోయిన రవీందర్ యాదవ్, కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు, తదితరులు పాల్గొన్నారు.