తంగళ్ళపల్లి నేటి ధాత్రి
తంగళ్ళపల్లి మండల కేంద్రం నుండి బిఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షుడు రాజన్న బి ఆర్ ఎస్ పార్టీ సీనియర్ నాయకులు స్థానిక ఉపసర్పంచ్ పెద్దూరు తిరుపతి ఆధ్వర్యంలో స్థానిక కాంగ్రెస్ నాయకులు పార్టీని వీడి మంత్రి కేటీఆర్ సమక్షంలో బి.ఆర్.ఎస్ పార్టీలోకి చేరినారు ఈ సందర్భంగా తెలంగాణ భవన్లో మంత్రి కేటీ రామారావు గులాబీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు వారు మాట్లాడుతూ మంత్రి కేటీ రామారావు చేసిన అభివృద్ధి సంక్షేమ పథకాలకు ఆకర్షితులమై పార్టీలో చేరామని మళ్లీ వచ్చి ఎన్నికల్లో మంత్రి కేటీ రామారావు అత్యధిక మెజార్టీ గెలుస్తారని ఈ సందర్భంగా తెలియజేశారు ఇట్టి కార్యక్రమంలో బి ఆర్ ఎస్ ప్రజా ప్రతినిధులు నాయకులు కార్యకర్తలు కుల సంఘాల సభ్యులు తదితరులు పాల్గొన్నారు