వరంగల్/గీసుగొండ,నేటిధాత్రి :
వరంగల్ జిల్లా పరకాల నియోజకవర్గ పరిధిలోని గీసుగొండ మండలం
కొమ్మాల గ్రామంలో బిఆర్ఎస్ పార్టీకి చెందిన నాయకులు పరకాల ఎమ్మెల్యే. వరంగల్ పార్లమెంట్ ఇంచార్జ్ రేవూరి ప్రకాష్ రెడ్డి సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు.కాంగ్రెస్ పార్టీ ప్రవేశపెట్టిన అటువంటి సంక్షేమ పథకాలకు ఆకర్షితులై కొమ్మాల గ్రామానికి చెందిన 30 కుటుంబాలు కాంగ్రెస్ పార్టీలో చేరగా వారికి పార్టీ కండువా కప్పి ఆహ్వానించినట్లు ఎమ్మెల్యే రేవూరి తెలిపారు.పార్టీలో చేరిన వారిలో బస్కే మని, బస్కే సాంబయ్య, కందుకూరి రమేష్, మామునూరి సుధాకర్, మామునూరి శ్రీనివాస్,తగరపు రాజు, తగరపు రఘు, మహేందర్, బస్తి సుధాకర్ తదితర 30 కుటుంబాలు చేరారు.ఈ కార్యక్రమంలో పరకాల నియోజకవర్గ అధికార ప్రతినిధి చాడ కొమరారెడ్డి, మండల అధ్యక్షులు తుమ్మలపల్లి శ్రీనివాస్, జిల్లా నాయకులు సాయిలి ప్రభాకర్, వర్కింగ్ ప్రెసిడెంట్ నాగారపు స్వామి, ఎంపీటీసీ గోపాల్, మండల మహిళా అధ్యక్షురాలు జక్కుల సరిత,గ్రామ అధ్యక్షులు ఈర్ల ప్రవీణ్, యూత్ నాయకులు బస్కే సుధాకర్,రవి,ఎస్టి నాయకులు ఉండ్రాతి స్వామి, ఎడ్ల కిరణ్ తదితరులు పాల్గొన్నారు.