టిఆర్ఎస్ నుండి కాంగ్రెస్ లో చేరిక

సీనియర్ నాయకులు గొట్టిముక్కల జస్వంత్ రావు (దేశాల్), ఎం. భీమ్ రావు సీఎం సమక్షంలో చేరిక

కూకట్పల్లి, ఏప్రిల్ 22 నేటి ధాత్రి ఇన్చార్జి

కూకట్ పల్లి చెందిన పలువురు నాయ కులు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు.గ తంలో కాంగ్రెస్ పార్టీలో పనిచేసిన ఈ నేతలు కొంతకాలంగా స్తబ్దతగా ఉన్నా రు.అయిత ఎమ్మెల్సీ మల్కాజ్ గిరి పార్లమెంట్ కాంగ్రెస్ అభ్యర్థి భర్త పట్నం మహేందర్ రెడ్డి విజ్ఞప్తి మేరకు కాంగ్రెస్ పార్టీలో చేరేందుకు అంగీకరించారు.ఇందు లో భాగంగా గొట్టిముక్కల జస్వంత్ రావు (దేశాల్),మొదలుగు భీమ్రావు,తులసి వర్ధన్ రావు,రామాంజన్ రెడ్డి,కొమ్ము బాబు,జాన్ తదితరులకు సీఎం రేవంత్ రెడ్డి కాంగ్రెస్ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు.ఈ సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ కష్టపడి పనిచేసే వారికి కాంగ్రెస్ పార్టీలో గుర్తింపు ఉంటుందని,కూకట్ పల్లికి చెందిన పలు వురు నేతలు కాంగ్రెస్ పార్టీలో చేరినం దుకు వారిని అభినందించారు.దేశాలు మాట్లాడుతూ పట్నం మహేందర్రెడ్డికి ఎమ్మెల్సీ,కూకట్పల్లి ఇన్చార్జి అయిన బండి రమేష్కి,కూకట్పల్లి కోఆర్డినేటర్ వినయ్ రెడ్డికి కూకట్పల్లి మాజీ అధ్య క్షులు శేరి సతీష్ రెడ్డికి,కాంగ్రెస్ పార్టీలో చేరిన సందర్భంగా పేరుపేరునా వీరికి ధన్యవాదాలు తెలియజేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!