ఆత్మీయ అభినందన సభ
చందుర్తి, నేటిదాత్రి:
జోగాపూర్ ప్రాథమిక పాఠశాలలో ఇటివల గ్రామపంచాయతీ ఎలక్షన్స్ లో ఎన్నికైన సర్పంచ్ మరియు వార్డు సభ్యులకు ఆత్మీయ అభినందన సభను పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు యెలిగేటి శ్రీలత గారు మరియు ఉపాధ్యాయ బృంధం ఏర్పాటు చేసి,ఘనంగా సన్మానించడం జరిగింది. ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి ప్రధానోపాధ్యాయురాలు యెలిగేటి శ్రీలత గారు మాట్లాడుతూ నూతనంగా ఏర్పడ్డ పాలకవర్గ సభ్యులు పాఠశాల మీద ప్రత్యేక శ్రద్ధ వహించగలరని, గ్రామంలో ఉన్న బడి ఈడు పిల్లలందరూ ప్రభుత్వ పాఠశాలకు వచ్చే విధంగా చొరవ చూపించాలని, విద్యార్థుల సంఖ్య పెంచే విధంగా కృషి చేయాలని విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి షహనాజ్ షమీర్ గారు మాట్లాడుతూ ఈ పాఠశాలకు మా వంతు సహకారం ఎల్లవేళలా అందిస్తామని తెలియజేశారు. మా మా పిల్లల్ని ఇదే పాఠశాలలో చేర్పించామని రానున్న రోజుల్లో విద్యార్థుల సంఖ్య పెరిగే విధంగా కృషి చేస్తానని తెలియజేశారు.
ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ షహనాజ్ సమీర్, ఉపసర్పంచ్ గంట మల్లేశం, మార్కెట్ కమిటీ డైరెక్టర్ అమరబండ సాయి, విలేజ్ సెక్రటరీ కే మారుతి
వార్డు సభ్యులు
గద్దరాశి రాజు
ఓల్లం లావణ్య తిరుపతి, గొల్లపల్లి నారాయణ,
పల్లి ప్రశాంత్,
చక్రాల మంగ,
అమర బండ రమ్యశ్రీ జలంధర్,
టేకుమల్ల రేణుక,
ముద్దాల ప్రవీణ్,
చింతం రాధా శంకర్
ఉపాధ్యాయులు ఎడ్ల కిషన్, పాము వెంకటేశ్వర్లు, గుడిపేట ప్రాథమిక పాఠశాల ప్రధానోపాధ్యాయులు లకావత్ రవి తదితరులు పాల్గొన్నారు.
