
MLA GSR
జోగంపల్లి చలివాగుప్రాజెక్టు నీటిని విడుదల చేసిన ఎమ్మెల్యే జీఎస్సార్
శాయంపేట నేటిధాత్రి:
శాయంపేట మండలం జోగం పల్లి చలివాగు ప్రాజెక్టు చెరువు నీటిని దిగువన ఉన్న పంట పొలాలకు నీటిపారుదల శాఖ, ఇతర శాఖల అధికారులు మరియు కాంగ్రెస్ నేతలతో కలిసి ముఖ్య అతిథిగా పాల్గొ న్న భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు నీటిని విడుదల చేశారు. అక్కడ తూము వద్ద ఎమ్మెల్యే టెంకాయ కొట్టి, చెరువులోకి పూలు చల్లారు. అనంతరం తూము గేట్ వాల్వ్ ను తిప్పి కిందికి నీటిని వదిలారు. అనం తరం ఎమ్మెల్యే మాట్లాడుతూ రైతు సంక్షేమమే సీఎం రేవంత్ రెడ్డి ప్రజాప్రభుత్వ ధ్యేయమని అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన మొదటి ఏడాదిలోనే రైతులకుఏకకాలం లో రెండు లక్షల రుణమాఫీ చేసిందన్నారు. రైతులు బాగుం టేనే గ్రామాలు అభివృద్ధిచెందు తాయన్నారు.ఈ కార్యక్రమం లో అన్ని గ్రామాల కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు అభిమానులు పాల్గొన్నారు.