Job Calendar Must Be Released
జాబ్ క్యాలెండర్ వెంటనే విడుదల చేయాలి
నిరుద్యోగులను ఆదుకోవాలి
ఏఐవైఫ్ రాష్ట్ర సహాయ కార్యదర్శి బావండ్లపల్లి యుగేందర్
కరీంనగర్, నేటిధాత్రి:
రేవంత్ సర్కార్ ఉద్యోగావకాశాలు కల్పించడంలో ఫేల్యూరైందని అఖిల భారత యువజన సమాఖ్య (ఏఐవైఫ్) రాష్ట్ర సహాయ కార్యదర్శి బావండ్లపల్లి యుగేందర్ ఒక ప్రకటనలో పేర్కొన్నారు. నిరుద్యోగులకు ఉద్యోగ ఉపాధి అవకాశాల కల్పనే ధ్యేయంగా మొదటి నుండి ప్రచారం చేసుకుంటున్న ప్రభుత్వం మరోవైపు నిరుద్యోగులను మోసం చేసే విధంగా రేవంత్ సర్కార్ నిర్ణయాలు తీసుకుంటున్నారని తేలిపారు. రాష్ట్రంలో సుమారుగా నలభై ఐదు లక్షల మంది నిరుద్యోగులు ఉద్యోగ, ఉపాధి అవకాశాలకై ఎదురుచూస్తున్నారని గత ఆసేంబ్లీలో జాబ్ క్యాలేండర్ ప్రవేశపేట్టిన ఉప ముఖ్యమంత్రి ఆయా తేదీలలో ఉద్యోగ ఉపాధి అవకాశాలకై తేదీలు ఆసెంబ్లీ వేదికగా ప్రకటించిన అక్టోబర్ నెలలో గ్రూప్-1 నోటిఫికేషన్ జనవరిలో డిఎస్సీ ఫిబ్రవరిలో ఎఫ్బివో ఇలా అనేక హమీలు నిరుద్యోగులకు ఇచ్చిన రేవంత్ సర్కార్ ఏఒక్క నోటిఫికేషన్స్ ను ఇంత వరకు ఇచ్చిన దాఖలాలు లేదన్నారు. ఆయా డిపార్ట్మెంట్ లలో ఖాళీ అయిన పోస్టులకు నోటిఫికేషన్స్ వేసి రిక్రూట్మెంట్ చేపట్టాలని నిరుద్యోగ యువతకు ఉపాధి ఉద్యోగావకాశాలు కల్పించాలని యుగేందర్ డిమాండ్ చేశారు.
