Vinod Balraj Wins Jarasangam Sarpanch Election
ఝరాసంగం సర్పంచ్ వినోద బాలరాజ్ ఘన విజయం
జహీరాబాద్ నేటి ధాత్రి:
సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ నియోజకవర్గం, ఝరాసంగం మండల గ్రామంలో జరిగిన సర్పంచ్ ఎన్నికల్లో బిఆర్ఎస్ పార్టీ అభ్యర్థి వినోద బాలరాజ్ భారీ మెజార్టీతో ఘన విజయం సాధించారు. ఎన్నికల ఫలితాల్లో ప్రత్యర్థులపై స్పష్టమైన ఆధిక్యతను సాధించిన వినోద బాలరాజ్ కు గ్రామ ప్రజలు సంపూర్ణ మద్దతు పలికారు. ఫలితాలు వెలువడగానే బిఆర్ఎస్ పార్టీ శ్రేణులు, అభిమానులు పెద్ద ఎత్తున సంబరాలు నిర్వహించారు. మిఠాయిలు పంచుకుంటూ విజయోత్సవాలు జరిపారు. ఈ సందర్భంగా నూతనంగా ఎన్నికైన సర్పంచ్ వినోద బాలరాజ్ మాట్లాడుతూ “గ్రామ ప్రజలు నాపై ఉంచిన విశ్వాసానికి ఎప్పటికీ రుణపడి ఉంటాను. నన్ను ఆదరించి గెలిపించిన ప్రతి కుటుంబానికి హృదయపూర్వక ధన్యవాదాలు. గ్రామాభివృద్ధి, ప్రజల సమస్యల పరిష్కారమే నా ప్రధాన లక్ష్యం. ఎలాంటి పరిస్థితుల్లోనైనా మీ బిడ్డగా మీకు అండగా ఉంటాను” అని తెలిపారు.
