ఝరాసంగం: ఆయిల్ పామ్తో అధిక ఆదాయం
ఝరాసంగం మండలం కుప్పానగర్ గ్రామానికి చెందిన
జహీరాబాద్. నేటి ధాత్రి:
మహిళా రైతు చంద్రమ్మ 5 ఎకరాల్లో ఆయిల్ పామ్ తోటను సాగు చేశారు. కేవలం 15 నెలల్లోనే మొక్కలు పుష్పించాయి. మంచి వృద్ధిని చూపుతున్నాయి. తోటల అభివృద్ధి శాఖ రాయితీపై మొక్కలను అందించగా, ప్రభుత్వం పెట్టుబడి సాయంగా ఎకరానికి నాలుగు సంవత్సరాలపాటు రూ.4,200 మంజూరు చేస్తోంది. పంటకు గిట్టుబాటు ధర రూ. 20,871 ప్రకటించడంతో ఈ పంట రైతులకు లాభదాయకంగా మారుతోంది.