A Symbol of Development – Former Sarpanch Jagadeeshwar
ఝరాసంగం అభివృద్ధికి ప్రతీక – మాజీ సర్పంచ్ జగదీశ్వర్
జహీరాబాద్ నేటి ధాత్రి:
https://youtu.be/buoN3vk7KSI?si=GWHV8pWQQ1wjhwLX
ఝరాసంగం మండలంలో జరిగిన హ్యుందాయ్ మోటార్ ఇండియా ఇంజనీరింగ్ ప్రైవేట్ లిమిటెడ్ సి.ఎస్.ఆర్ కార్యక్రమం ఒక సాధారణ సేవా కార్యక్రమం కాదు… ఇది ఒక నాయకుడి దూరదృష్టి, పట్టుదల, గ్రామం పట్ల నిబద్ధతకు ప్రతీక.ఈ మహత్తర కార్యక్రమం వెనుక ఉన్న అసలు శక్తి –ఝరాసంగం మాజీ సర్పంచ్ జగదీశ్వర్ గ్రామాభివృద్ధి అంటే కేవలం మాటలు కాదు…కార్పొరేట్ సంస్థలను సంప్రదించి, ప్రభుత్వ హాస్టళ్ల పరిస్థితిని వివరించి, అవసరాలను వివరంగా తెలియజేసి, ప్రతీ అంశాన్ని స్వయంగా పర్యవేక్షించి – ఈ భారీ సహాయాన్ని ఝరాసంగానికి తీసుకురావడంలో ఆయన కీలక పాత్ర పోషించారు.295 బంక్ బెడ్లు.590 పరుపులు 4 మొబైల్ టాయిలెట్లు 130 ట్రంక్ బాక్స్‌లు 42 ఇనుప రాక్లు.కంప్యూటర్లు, ప్రింటర్లు, లైబ్రరీ సామగ్రి దోమతెరలు, ఫ్యాన్లు, బీరువాలు తదితర వసతి సామగ్రి ఇది సాధారణ సహాయం కాదు –ఇది వందలాది విద్యార్థుల భవిష్యత్తును ప్రభావితం చేసే మహత్తర మార్పు..హాస్టల్ విద్యార్థులు ఇకపై నేలపై నిద్రపోవాల్సిన అవసరం లేదు పరిశుభ్రత మెరుగుపడుతుంది డిజిటల్ విద్యా సదుపాయాలు అందుబాటులోకి వచ్చాయి
గ్రంథాలయ అభివృద్ధితో చదువుపై ఆసక్తి పెరుగుతుంది ఇది అన్నీ సాధ్యమైంది ఎందుకంటే –
జగదీశ్వర్ గ్రామాన్ని తన కుటుంబంలా భావిస్తారు.
పదవి లేకున్నా సేవ ఆగలేదు…అధికారంలో లేకున్నా అభివృద్ధి ఆగలేదు గ్రామం కోసం ఆయన పోరాటం, పట్టుదల ఎప్పటికీ కొనసాగుతూనే ఉంది.ఝరాసంగం ప్రజల గర్వకారణం
సమాజ సేవకు మారుపేరు యువతకు ఆదర్శం
విద్యార్థుల భవిష్యత్తుకు ఆశాకిరణం –
జగదీశ్వర్ ఇలాగే ఝరాసంగం అభివృద్ధి పథంలో ముందుకు సాగాలని హృదయపూర్వక శుభాకాంక్షలు
