
World Photography Day
ఝరాసంగం ఘనంగా వరల్డ్ ఫోటోగ్రఫీ డే వేడుకలు,
జహీరాబాద్ నేటి ధాత్రి:
జహీరాబాద్ నియోజకవర్గం ఝరాసంగం మండల కేంద్రంలో వరల్డ్ ఫోటోగ్రఫీ డే వేడుకలు మంగళవారం ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా సంఘ వ్యవస్థాపక అధ్యక్షుడు వీరన్న పటేల్, మండల అధ్యక్షుడు దినకర్, ఫోటోగ్రాఫర్లు లూయిస్ డాగ్యురే చిత్రపటానికి పూలమాల వేసి, తోటి ఫోటోగ్రాఫర్లకు శుభాకాంక్షలు తెలిపారు. ఫోటోగ్రఫీ కేవలం కళ మాత్రమే కాదని, ప్రపంచాన్ని కొత్త కోణంలో చూడటానికి, సంస్కృతి, ప్రకృతి, మానవ భావోద్వేగాలను భవిష్యత్ తరాల కోసం భద్రపరిచే అద్భుత మాధ్యమమని వీరన్న పటేల్ అన్నారు.