
Zharasangam 10th Class Reunion"
ఝరాసంగం 10వ తరగతి పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం – పాత విద్యార్థులు 12 ఏళ్ల తర్వాత మళ్లీ కలిశారు
జహీరాబాద్ నేటి ధాత్రి:
ఝరాసంగం మండల కేంద్రంలో ప్రతి ఒక్కరి జీవితంలో స్నేహితుల పాత్ర ఎంతో కీలకం. ఆట పాటలు, చిల్లర పనులు కష్టం సుఖం ఇలా ఏదైనా కాని అన్నింట్లో మన వెన్నంటే ఉండీ సపోర్ట్ చేసేది ఒక స్నేహితులు మాత్రమే. అందరి కన్నా మన జీవితంలో చెరగని ముద్ర వేసేది పదవ తరగతి వరకు చదువుకున్న దోస్తులు.. వారితో ఉన్న జ్ఞాపకాలు ఎన్నటికి మరచిపోనివి మరుపు రానివి.. పదో తరగతి తర్వాత దూరమైన అలాంటి స్నేహితులను మళ్లీ 12 ఏళ్ల తర్వాత అందరు ఆత్మీయ సమ్మేళనం పేరుతో కలుసుకుంటే ఎంత ఆనందంగా ఉంటుందో.. అలా కలిసి జ్ఞాపకాలు నెమరేసుకున్న ఝరాసంగం ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో చదివిన 2012–13 పదవ తరగతి బ్యాచ్..ఇట్టి కార్యక్రమంలో ఉపాధ్యాయులు ప్రధానోపాధ్యాయులు మల్లేశం మరియు రాజ్ కుమార్ మరియు ఓంకార్ మరియు ఈశ్వర్ రమేష్ ప్రవీణాలత సంగీత పిటి కిషోర్ షేక్ సోహెల్ వీరారెడ్డి యశ్వంత్ సురేష్ శ్రీను ముక్తార్ పాల్గొన్నారు,