
Jhansi & Yashaswini Reddy’s Mission for Congress Victory.
కార్యకర్తలను గెలిపించడమే ఝాన్సీ,యశస్విని రెడ్డి లక్ష్యం
-కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ సీనియర్ నాయకులు పెదగాని సోమయ్య
తొర్రూరు డివిజన్ నేటి ధాత్రి
రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలను ప్రజా ప్రతినిధులుగా చేయడమే ఝాన్సీ యశస్విని రెడ్డి లక్ష్యమని కాంగ్రెస్ పార్టీ పాలకుర్తి నియోజకవర్గం సీనియర్ నాయకులు పెదగాని సోమయ్య అన్నారు. గురువారం డివిజన్ కేంద్రంలోని కాంగ్రెస్ పార్టీ క్యాంపు కార్యాలయంలో కాంగ్రెస్ పట్టణ అధ్యక్షుడు సోమ రాజశేఖర్ అధ్యక్షతన జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ పార్టీ కోసం పనిచేసే కార్యకర్తలు నాయకులను ఝాన్సీ యశస్విని రెడ్డిలు గుర్తిస్తారని అన్నారు. కాంగ్రెస్ పథకాలను ప్రజల్లో తీసుకుపోయి ప్రచారం చేయాలని అన్నారు. గత శాసనసభ ఎన్నికల్లో ఎమ్మెల్యే యశస్విని రెడ్డిని ఎలా గెలిపించారో రాబోయే ఎన్నికల్లో వారు కష్టపడి కార్యకర్తలను గెలిపించేందుకు సిద్ధంగా ఉన్నారని తెలిపారు. పేద బడుగు బలహీన వర్గాల కోసమే నిరంతరం ప్రజల మధ్యలో ఉండి సేవలందించి అభివృద్ధి చేస్తున్నారని అన్నారు. ఝాన్సీ యశస్విని రెడ్డిలు కాంగ్రెస్ పార్టీ శ్రేణులకు కాంగ్రెస్ జెండాకు అండగా ఉన్నారని, పార్టీ లైన్ దాటిన వారిపై చర్యలు తీసుకుంటారని అన్నారు. పాలకుర్తిలో 40 ఏళ్ల చరిత్రను తిరగరాసిన వ్యక్తులపై విమర్శలు చేయడం సిగ్గుచేటు అన్నారు. తెలంగాణ కోసం ఎంతమంది బలైన కాంగ్రెస్ పార్టీ గుర్తించి సోనియా గాంధీ తెలంగాణ రాష్ట్ర ఇచ్చిందన్నారు. రాజీవ్ గాంధీ కంప్యూటర్ యుగాన్ని తీసుకొచ్చి లక్షలాది నిరుద్యోగ యువతకు ఉపాధి కల్పించాలని అన్నారు. తెలంగాణలో సీఎం రేవంత్ రెడ్డి ప్రజా ప్రభుత్వంలో అనేక సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టి అమలు చేశాడని అన్నారు.గ్రామాలలో కాంగ్రెస్ పార్టీ ఓటు బ్యాంకు ఉంటుందని, రాబోయే ఎన్నికల్లో కాంగ్రెస్ కార్యకర్తలను గెలిపించేందుకు ప్రతి ఒక్కరు సిద్ధంగా ఉండాలని కోరారు. ఈ సమావేశంలో కాంగ్రెస్ మండల వర్కింగ్ ప్రెసిడెంట్ మేకల కుమార్, ఎస్టి సేల్ మండల అధ్యక్షుడు జాటోత్ రవి నాయక్, నాయకులు అలువాల సోమయ్య, బిజ్జాల అనిల్, గోపి నాయక్, సురేందర్ నాయక్, పరశురాములు, రమేష్, వెంకన్న తదితరులు పాల్గొన్నారు.