Inspiration from Jhansi Lakshmi Bai
ఝాన్సీ లక్ష్మీబాయి ని ఆదర్శంగా తీసుకొని ఎదగాలి.
సబ్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ హేమ.
చిట్యాల, నేటి ధాత్రి :
చిట్యాల ఎబివిపి శాఖ ఆధ్వర్యంలో మండల కేంద్రంలోని ఆదర్శ పాఠశాలలో గురువారం రోజున ఝాన్సీ లక్ష్మీబాయి జయంతి సందర్భంగా సెమినార్ నిర్వహించడం జరిగింది, ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా “చిట్యాల ఎస్సై 2 హేమ హాజరై మాట్లాడుతూ ఝాన్సీ లక్ష్మీబాయిని* ఆదర్శంగా తీసుకొని సమాజంలో ఉన్నతంగా స్థిరపడాలని , మహిళలు అన్ని రంగాల్లో రాణించాలని మానసికంగా, శారీకంగా దృడ సంకల్పం తో ముందు కు సాగుతో లక్ష్యం కోసం శ్రమించాలని* , సోషల్ మీడియాకు , దూరంగా ఉండాలని , పాఠశాల స్థాయి నుండే ఉన్నత లక్ష్యాలు ఏర్పాటు* చేసుకోవాలని అన్నారు అంతే కాకుండా బాల్యవివాహాలు చేసుకోవద్దని, చదువు ఆటల్లో ముందుంటూ సంస్కృతిని కాపాడాల్సిన బాధ్యత విద్యార్థులపై ఉందన్నారు, సమాజంలో* “నడిపించేది మహిళా అని అన్నారు , విద్యార్థులు గంజాయికి , బెట్టింగ్ యాప్స్ కు దూరంగా ఉండాలని సూచనలు చేయడం జరిగింది ,క్రమశిక్షణ తో ముందుకు సాగుతూ తల్లిదండ్రులను గర్వకారణం కావాలి* అని తెలియజేశారు..
వ్యాసా రచన పోటీల లో గెలుపొందిన విద్యార్థులకు* బహుమతులు అందజేయడం జరిగింది*
ఈ కార్యక్రమంలో ఎబివిపి స్టేట్ హాస్టల్స్ కన్వీనర్ వేల్పుల రాజు కుమార్ ,నగర కార్యదర్శి అజయ్ , ఇంచార్జి ప్రిన్సిపాల్* *రవీందర్,నాయకులు సాయి ,శశి వర్ధన్ ,విద్యార్థులు,ఉపాధ్యాయులు పాల్గొన్నారు.
