భూపాలపల్లి నేటిధాత్రి
టేకుమట్ల కేజీవీబీ పాఠశాల స్పెషల్ ఆఫీసర్ సప్న ఆధ్వర్యంలో నోట్ బుక్స్ పంపిణీ కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమానికి స్థానిక జడ్పిటిసి పులి తిరుపతి రెడ్డి ముఖ్య అతిథిగా హాజరైనారు అనంతరం విద్యార్థులకు యూనిఫామ్స్ పాఠ్యపుస్తకాలు నోటు బుక్స్ పంపిణీ చేయడం జరిగింది అనంతరం వారు మాట్లాడుతూ విద్యార్థులు కష్టపడి చదివి మంచి ఉన్నతమైన స్థానాలకు ఎదగాలని ఆకాంక్షిస్తున్నాను తల్లిదండ్రులు విద్యార్థులను ప్రోత్సహించి చదువుకోవడానికి ప్రోత్సహించాలి ఎవరైతే కష్టపడి చదువుతారో వారు మంచి ఉన్నతమైన స్థానంలో ఉంటే వారి తల్లిదండ్రులకు ఆ పాఠశాలకు ఉపాధ్యాయులకు మంచి పేరును తీసుకొచ్చిన వారు అవుతారు ప్రతి ఒక్కరూ ఇది దృష్టిలో పెట్టుకొని కష్టపడి చదివి మంచి ఉన్నతమైన స్థానంలో ఉండాలని కోరుకుంటున్నాను ఈ కార్యక్రమంలో పాఠశాల చైర్మన్ రమాదేవి వైస్ ఎంపీపీ పోతన వేణి ఐలయ్య ఉపాధ్యాయులు విద్యార్థులు పాల్గొన్నారు