
చిట్యాల, నేటి ధాత్రి :
జయశంకర్ భూపాలపల్లి జిల్లా చిట్యాల మండలంలోని జూకల్, గ్రామాలలో పార్లమెంటు ఎన్నికల ప్రచారంలో భాగంగా ఉపాధి హామీ పనులు చేస్తున్న ప్రజలను కలిసి బిఆర్ఎస్ పార్టీ ఎంపి అభ్యర్థి డాక్టర్ మారపల్లి సుధీర్ కుమార్* కారు గుర్తుపై ఓటు వేసి గెలిపించాలని కోరారు, అలాగే తెలంగాణా రాష్ట్రంలో గతంలో బిఆర్ఎస్ పార్టీ రైతుల సంక్షేమం కోసం రైతు బంధు, రైతు భీమా లాంటి అద్బుతమైన పథకాలు ఇవ్వడం జరిగిందని వివరించారు కళ్యాణ లక్ష్మితో ఆడబిడ్డల తల్లిదండ్రులకు అండగా నిలబడ్డారని వృద్ధులకు వికలంగులకు ఒంటరి మహిళలకు ఆసరా ఫించన్లతో అండగా నిలబడ్డారని గుర్తు చేసారు గత శాసనసభ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ బోగస్ హామీలతో రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిందని ఎన్నికల హామీలు అమలు చేయడంలేదని ప్రజలను మోసం చేసిన కాంగ్రెస్ పార్టీకి ఎంపి ఎన్నికల్లో తగిన గుణపాఠం చెప్పాలని బిఆర్ఎస్ పార్టీ అభ్యర్థి డాక్టర్, మారపల్లి సుధీర్ కుమార్ గారిని గెలిపించాలని కోరారు.
ఈ కార్యక్రమంలో మండల ప్రధాన కార్యదర్శి మడికోండ రవీందర్ రావు,పుట్టపాక మహేందర్ ఎంపీటీసీల ఫోరం ప్రెసిడెంట్ జంబులా తిరుపతి పిట్ట సురేష్ బాబు గ్రామా శాఖ అధ్యక్షుడు కోడారి రవి డైరెక్టర్స్ గుర్రం మహేందర్ దామెర రాజు జంబుల చంద్రమౌళి చాడ ఆనంద్ రెడ్డి మదాసు సామీదాసు అన్నం సంతోష్ మేకల సాంబయ్య సుర శామ్ శిలపాక అంజి కవాటి రమేష్ ఎలగొండ తిరుపతి కసిరెడ్డి మహేందర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.