మునిసిపల్ కమిషనర్ గా జైత్ రామ్
జహీరాబాద్ నేటి ధాత్రి:
జహీరాబాద్ మునిసిపల్ కమిషనర్ గా జయతి రాములును నియమిస్తూ బుధవారం ఉత్తర్వులు జారీ అయ్యాయి. ప్రస్తుతం కమిషనర్ గా ఉన్న సత్యప్రనవ్ శిక్షణకు వెళ్లడంతో, రంగారెడ్డి జిల్లా మెప్మాలో పనిచేస్తున్న జయతి రాములుకు పదోన్నతి కల్పించి ఈ బాధ్యతలు అప్పగించారు. ఈ నియామకం ద్వారా జహీరాబాద్ పట్టణ పరిపాలనలో మార్పు చోటుచేసుకుంది.
