మహాదేవపూర్ -నేటి ధాత్రి:
ప్రమాదవశాత్తు బిల్డింగ్ పై నుండి పడి వెన్నుపూస విరిగి పంచానికి పరిమితమైన పేద కుటుంబానికి జయశంకర్ ఫౌండేషన్ చేయూతనందిస్తూ 5000 రూపాయల ఆర్థిక సహాయాన్ని అందించింది. బుధవారం రోజు ఫౌండేషన్ చైర్మన్ ఐలి మారుతి ప్రెసిడెంట్ పోచన్న, జిల్లాలోని మొగుళ్లపల్లి మండలం ఇన్సపేట గ్రామానికి చెందిన గుడిపాక అనిల్, గత సంవత్సరం నుండి వెన్నుపూస విరగడంతో మంచానికి పరిమితం కావడంతో భార్య కూలి పని చేస్తూ కుటుంబాన్ని పోషిస్తుంది, వీరికి ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారు. ఆర్థిక స్తోమత లేకపోవడంతో చికిత్స కూడా చేసుకునే పరిస్థితి లేదు. సమాచారం తెలుసుకున్న జయశంకర్ ఫౌండేషన్ అనిల్ కుమార్ ఇంటికి వెళ్లి ఆర్థిక సహాయంతో పాటు నిత్యవసర వర్తిస్తువులను అందజేసి మెరుగైన చికిత్సకు సహాయంగా ఉంటామని భరోసా కల్పించడం జరిగింది. అలాగే పలువురు అనారోగ్యాలతో బాధపడుతున్న కుటుంబాలను కూడా పరామర్శించారు ఫౌండేషన్ చైర్మన్ ప్రెసిడెంట్ తోపాటు మండల ఇన్చార్జి ఫౌండేషన్ సభ్యులు ఉన్నారు.