అనారోగ్యంతో బాధపడుతున్న నిరుపేద కు ఉచిత ఆపరేషన్
బండి భద్రయ్య కి ఉచితంగా ఆపరేషన్ చేయించిన జయశంకర్ ఫౌండేషన్ చైర్మన్ అయిలి మారుతీ
గణపురం నేటి ధాత్రి
గణపురంమండలం మైలారం గ్రామానికి చెందిన బండి భద్రయ్య తలకి గడ్డ పుట్టి చాలా సంవత్సరాలనుండి అనారోగ్యంతో బాధపడుతున్నారు వారు ప్రైవేట్ హాస్పిటల్ వెళ్లి చూపించుకోగ హాస్పిటల్ డాక్టర్లు ఆపరేషన్ కోసం 50 నుంచి 60 వేల వరకు ఖర్చు అవుతుంది అని చెప్పగా వారి దగ్గర డబ్బులు లేక ఇంటికి తిరిగిరవడం జరిగింది ఆ తరువాత గ్రామంలో ఉన్న కొందరు వ్యక్తులు జయశంకర్ ఫౌండేషన్ చైర్మన్ అయిలి మారుతీ కి చేప్పగా వెంటనే స్పందించి వారి ఇంటికి వచ్చి వారిది నిరుపేద కుటుంబం కావడంతో వారి ఆర్థిక పరిస్థితులు తెలుసుకొని చలించిపోయిన అయిలి మారుతి అన్న బండి భద్రయ్య ని వెంటనే హాస్పిటల్ తీసుకెళ్లి ఉచితంగా ఆపరేషన్ చేయించడం జరిగింది అనంతరం మళ్ళీ కొద్దీ రోజుల తరువాత వారి ఇంటికి వెళ్లి వారి ఆరోగ్య పరిస్థితులు అడిగి తెలుసుకున్న జయశంకర్ ఫౌండేషన్ చైర్మన్ అయిలి మారుతీ
