రామడుగు, నేటిధాత్రి:
కరీంనగర్ జిల్లా రామడుగు మండల కేంద్రంలోని ఎంపీడీవో కార్యాలయంలో ఎంపీపీ ఎన్నికపై డిఆర్డివో శ్రీధర్ ఎన్నికలు నిర్వహించారు. ఈఎన్నికల్లో ఎంపీపీ పదవికి జవ్వాజి హరీష్ మాత్రమే కాంగ్రెస్ పార్టీ బీఫాంతో నామినేషన్ దాఖలు చేయడంతో రామడుగు మండల ప్రజా పరిషత్ అధ్యక్షునిగా జవ్వాజి హరీష్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారని డిఆర్డివో తెలిపారు. మొత్తం పద్నాలుగు మంది ఎంపీటీసీ సభ్యులు హాజరు కావాల్సి ఉండగా వెలిచాల గ్రామానికి చెందిన ఎంపీటీసీ సభ్యురాలు గతంలోనే రాజీనామా చేయగా మరో ఇద్దరు ఎంపీటీసీ సభ్యులు గైర్హాజరయ్యారు. మిగిలిన పదకొండు మంది సభ్యులతో ఎన్నికలు నిర్వహించగా జవ్వాజి హరీష్ ను ఏకగ్రీవంగా ఎన్నికోవడంతో, హరీష్ కు నియామక పత్రాన్ని డిఆర్డివో అందజేశారు. ఎంపిక అనంతరం అంబేద్కర్ విగ్రహనికి పూలమాల వేసి నమస్కరించి హరీష్ ఎంపిపిగా బాధ్యతలు స్వీకరించారు. ఈసందర్భంగా చోప్పదండి శాసనసభ్యులు మేడిపల్లి సత్యం హాజరై హరీష్ ను అభినందించారు. ఎంపిపి హరీష్ మాట్లాడుతూ రామడుగు మండల పరిషత్ అధ్యక్షుడిగా నన్ను ఏకగ్రీవంగా ఎన్నుకున్న అన్ని పార్టీల సహచర ఎంపిటిసి సభ్యులకు మొట్టమొదటగా నాహృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుతూ, ఈమండలంలో ఉన్నత బాధ్యతలు రావడానికి అవకాశం కల్పించిన వన్నారం, కొక్కెరకుంట గ్రామ ప్రజలకు జీవితాంతం ఋణపడి ఉంటానని, ఎంపిటిసిగా ప్రయాణం చేపట్టిన నాటి నుండి నేడు ఎంపిపిగా పదవీ బాధ్యతలు చేపట్టేవరకు నాకు అన్ని విషయాల్లో సహకరించిన పాత్రికేయ మిత్రులకు ఈసందర్భంగా ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటున్నానని, అతి పిన్న వయసులోనే నాలో వున్న రాజకీయ ఆసక్తిని గుర్తించి, ఎంపిటిసి టిక్కెట్ ఇచ్చి గెలిపించడమే కాకుండా ప్రజా ప్రభుత్వం ఏర్పడిన తర్వాత చొప్పదండి నియోజకవర్గంలోనే తనకి మొట్టమొదటి అవకాశం కల్పించిన చొప్పదండి శాసనసభ్యులు మేడిపల్లి సత్యంకి ఈసందర్భంగా ప్రత్యేక ధన్యవాదాలు, కృతఙ్ఞతలు తెలియజేస్తూ, నాకు ఉన్న ఈకొద్ది సమయం అయినప్పటికి యువ నాయకులు చొప్పదండి నియోజకవర్గ శాసనసభ్యులు మేడిపల్లి సత్యం సంపూర్ణ సహాయ సహకారాలతో రామడుగు మండలాన్ని అన్నివిధాలుగా అభివృద్ది చేయడానికి శక్తి వంచన లేకుండా కృషి చేస్తానని, తనకు సహకరించిన ప్రతీ ఒక్క కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యులందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాని తెలిపారు. ఈకార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు బొమ్మరవేణి తిరుపతి ముదిరాజ్, ఎంపిడివో రాజేశ్వరి, సూపరింటెండెంట్ రాజేష్ నాయక్, కాంగ్రెస్ పార్టీ నాయకులు, తదితరులు పాల్గొన్నారు.