కారేపల్లి నేటి ధాత్రి
సింగరేణి మండలం ఎస్సైగా పనిచేసి ప్రజల మన్ననలు పొందిన పుష్పాల రామారావు గారు ట్రాన్స్ఫర్ అయ్యి వెళ్తున్నారని తెలుసుకున్న కాంగ్రెస్ పార్టీ మండల యువజన నాయకుడు జరుపుల చందర్ నాయక్ వారిని కారేపల్లి పోలీస్ స్టేషన్ లో మర్యాదపూర్వకంగా కలిసి శాలువాతో సత్కరించారు మండలంలో వారు చేసిన సేవలు అద్భుతమని కొనియాడారు రామారావు సార్ లాంటి ప్రభుత్వ ఉద్యోగులు అందరూ వారిలా ఉంటే ప్రజలకు ఎలాంటి కష్టాలు ఇబ్బందులు ఉండవని ఆపదలో ఉన్న వారిని ఆదుకున్న మంచి మనస్సున్నవారని తెలియజేశారు వారు సర్వీసులో ఎంతో ఉన్నత స్థానాలకు వెళ్లాలని ప్రశంసలు అవార్డులు రివార్డులు పొందాలని కోరుకుంటు న్నట్లు గా తెలిపారు.