
డబ్ల్యూ పీసీలో రాష్ట్రస్థాయి ప్రధాన స్థానం
ప్రభుత్వం ప్రోత్సహిస్తే జాతీయ స్థాయిలో రాణిస్తానంటున్న మల్లేశం
చేర్యాల నేటిధాత్రి….
సిద్దిపేట జిల్లా మద్దూరు మండలం మర్మాముల శివారు బంజేరు గ్రామానికి చెందిన జంగిలి మల్లేశం తెలంగాణ రాష్ట్రంలో క్రీడలలో రాణిస్తూ అందరి మన్ననలు పొందుతున్నారు. ఆయనను ప్రభుత్వం ప్రోత్సహిస్తే మరింత ముందుకు పోత అంటున్నారు. జంగిలి మల్లేశం 2024 జనవరి 26న హైదరాబాదులో జరిగిన రాష్ట్రస్థాయి ఛాంపియన్షిప్ డబ్ల్యూ పీసీ తరఫున పోటీలో పాల్గొని మాస్టర్ కేటగిరీలో పాల్గొని బెంచ్ ప్రెస్ లో 65 నుండి 70 కిలోలు లేపి 100 కిలోల డెడ్ లిఫ్ట్ చేసి మాస్టర్ కేటగిరీలో ప్రధాన స్థానంలో నిలిచారు. మద్దూరు మండలంలోని మారుమూల పల్లెటూరులో జన్మించి వృత్తిరీత్యా హైదరాబాద్ లోని లేజర్ సేవింగ్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ సంస్థలో ఉద్యోగం చేస్తూ ఈ స్థాయికి రావడం పట్ల ఆయనను శుక్రవారం చేర్యాల బీరప్ప దేవాలయం వద్ద కురుమ సంఘం నాయకులు శాలువాతో ఘనంగా సన్మానించి అభినందించారు. సన్మానించిన వారిలో సీపీఐ జిల్లా కార్యవర్గ సభ్యులు అందే అశోక్, ఆల్ ఇండియా ఫార్వార్డ్ బ్లాక్ జిల్లా కార్యదర్శి అందె బీరయ్య, కురుమ సంఘం నియోజకవర్గ అధ్యక్షులు ఓరుగంటి శంకర్, ప్రధాన కార్యదర్శిలు అందె నాని బాబు, కార్యదర్శి జంగిలి యాదగిరి, వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా అధ్యక్షులు ఈరి భూమయ్య, యాదవ సంఘం జిల్లా నాయకుడు కర్రె నర్సింహులు, కురుమ సంఘం మండల నాయకుడు సూర్ణ శ్రీకాంత్, మేక యాదగిరి, బండారి అంజయ్య, రైతు సంఘం మండల కార్యదర్శి కత్తుల భాస్కర్ రెడ్డి, పాల్గొన్నారు.