పరకాల నేటిధాత్రి
సోమవారం హన్మకొండ జిల్లా పరకాల మండలం వెల్లంపల్లి గ్రామంలో ఎం.డి రహిమొద్దిన్ పంటపొలం లో జననీ సీడ్స్ వారు ఆధ్వర్యంలో ఆకాష్ బీజీ విత్తనాల పైన సోమవారం రైతులకు పత్తి ప్రదర్శన క్షేత్ర జరిగినది.ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా కంపెనీ జోనల్ మేనేజర్ పి ఎస్ కోటేశ్వరరావు పాల్గొన్నారు.ఈ యొక్క ప్రదర్శనకు 30 గ్రామాల నుంచి రైతులు సుమారు 350 మంది పైగా పాల్గొని ఈ యొక్క పత్తి పంటను పరిశీలించారు.ఆకాష్ బిజీII పత్తి విత్తనాలు ఎటువంటి వాతావరణ పరిస్థితిలో అయినా తట్టుకొంటుందని.పచ్చ దోమ తెల్ల దోమ కూడా తట్టు కొంటుందని కంపెనీ జోనల్ మేనేజర్ పి ఎస్ కోటేశ్వరరావు రైతులకు వివరించారు.జననీ సీడ్స్ వారి మెలైన వంగడాలు సర్కార్ జై కిసాన్ విత్తనాలుఉన్నాయని వివరించారు.జనని సీడ్స్ విత్తనాలు వాడి అధిక దిగుబడులు పొందగలరని అన్నారు.ఈ కార్యక్రమంలో కంపెనీ అర్.ఎం.వాస శంకర్ రావు,ఏరియా మేనేజర్లు గొడిశాల రంజిత్ కుమార్,ఎం.వెంకన్న ,నీరుడు కనకయ్య డి.బిక్షపతి తదితరులు పాల్గొన్నారు.