రామడుగు, నేటిధాత్రి:
కరీంనగర్ జిల్లా రామడుగు మండలం గోపాలరావుపేట గ్రామానికి చెందిన ఏగోలపు మల్లేశం భారతి దంపతులు ఇటివల జరిగిన రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడి చికిత్స పొందుతున్న సందర్భంగా వారి కుటుంబ సభ్యులకు జనచైతన్య యూత్ క్లబ్ ఆధ్వర్యంలో లక్ష రూపాయలను విరాళం అందజేశారు. ఈకార్యక్రమంలో కర్ర విద్యాసాగర్ రెడ్డి, రాగుల తిరుపతి, కోయల్కర్ శ్రీనివాస్, కొండ మునీందర్, కొలిపాక మల్లేశం, తదితరులు పాల్గొన్నారు.