
#జాతర ఏర్పాట్లను పరిశీలించిన ఏసిపి కిరణ్ కుమార్.
నల్లబెల్లి , నేటి ధాత్రి : తెలంగాణ ప్రజల ఆరాధ్య దైవం సమ్మక్క సారక్కల జాతర గద్దెలకు జంపన్న రాకతో అంగరంగ వైభవంగా మద్ది మేడారం జాతర మంగళవారం ప్రారంభమైంది. జాతర పూజారులు దురుశెట్టి సమ్మయ్య సమ్మక్క దంపతులు చింతల చెరువు నుండి జంపన్న ను గద్దెకు తీసుకువచ్చి పట్టు వస్త్రాలు సమర్పించి ప్రతిష్టించినట్లు పేర్కొన్నారు. అనంతరం జాతర ప్రాంగణంలో ఉన్న నాగేంద్ర స్వామి పుట్టకి ప్రత్యేక పూజ నిర్వహించి కడవ కుండాలను ఏర్పాటు చేసినట్లు వారు తెలిపారు. వీరి వెంట గ్రామీణ సిఐ శ్రీనివాస్. ఎస్సై నైనాల నగేష్. దేవాలయ పూజారులు దురుశెట్టి నాగరాజు. హరికృష్ణ.సువర్ణ. జాతర చైర్మన్ గాదె. సుదర్శన్ కమిటీ సభ్యుల తోపాటు భక్తులు పాల్గొన్నారు..