మున్సిపల్ చైర్మన్ తక్కలపల్లి రాజేశ్వరరావు
జమ్మికుంట: నేటి ధాత్రి
జమ్మికుంట మున్సిపల్ పరిధిలోని 13వ వార్డు, 25వ వార్డులలో అభివృద్ధి పనులను మున్సిపల్ చైర్మన్ తక్కలపల్లి రాజేశ్వరరావు ప్రారంభించారు.
జమ్మికుంట మున్సిపల్ పరిధిలోని 13వ వార్డు ఆ బాధి జమ్మికుంటలో 5 లక్షల రూపాయల నిధులతో సైడ్ ట్రైన్ పనులను మున్సిపల్ చైర్మన్ తక్కలపల్లి రాజేశ్వరరావు ప్రారంభించారు. అదేవిధంగా గణేష్ నగర్ రోడ్ నెంబర్ వన్ లో 25 వ వార్డులో ఐదు లక్షల రూపాయల నిధులతో సిసి రోడ్డు పనులను మున్సిపల్ చైర్మన్ రాజేశ్వరరావు తో పాటు కమిషనర్ ఆయాజ్ పాల్గొని ప్రారంభించారు. ఈ సందర్భంగా చైర్మన్ రాజేశ్వరరావు మాట్లాడుతూ జమ్మికుంట పట్టణాన్ని అన్ని హంగులతో సమగ్రంగా అభివృద్ధి పరచడమే తమ లక్ష్యమని, ప్రతి వార్డులో ఇప్పటికే సీసీ రోడ్లతో పాటు మురికి కాలువలను ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. పట్టణ ప్రజలందరూ కూడా తడి చెత్త పొడి చెత్తను వేరువేరుగా వేస్తూ మున్సిపల్ సిబ్బందికి సహకరించుతూ సకాలంలో నీటి బిల్లులతోపాటు ఇంటి బిల్లులు కట్టాలని కోరారు. ఈ కార్యక్రమంలో కౌన్సిలర్లు బచ్చు మాధవి శివకుమార్, దయ్యాల శ్రీనివాస్ ,భోగం వెంకటేష్ తో పాటు ఎర్రబెల్లి సంపత్ రావు, వెంకన్న తదితరులుపాల్గొన్నారు.అనంతరం ఇటీవల అనారోగ్యంతో మృతిచెందిన ఆబాది జమ్మికుంట గ్రామానికి చెందిన ఎర్ర రాజ కొమురయ్య కుటుంబాన్ని పరామర్శించి ప్రగాఢ సానుభూతిని మున్సిపల్ చైర్మన్ తో పాటు కమిషనర్ కౌన్సిలర్లు వ్యక్తం చేశారు.