కారేపల్లి నేటి ధాత్రి.
సింగరేణి మండలం ఉసిరికాయలపల్లి గ్రామపంచాయతీ లో గ్రామసభ పంచాయతీ కార్యదర్శి రవికుమార్ అధ్యక్షతన నిర్వహించడం జరిగింది ఈ గ్రామ సభకు సింగరేణి మండల ఎమ్మార్వో ఎంపీడీవో హాజరై సభను పర్యవేక్షించినారు గ్రామ సభలో ముఖ్యంగా సీసీ రోడ్లు ఎండాకాలంలో నీటి సమస్య గ్రామపంచాయతీలో ఎక్కువ మంది రైతులు పాడి పరిశ్రమ వ్యవసాయం మీద ఆధారపడి జీవిస్తున్నారు రైతుల పశువులకు వాటి ఆరోగ్య పరిరక్షణ ఇంజక్షన్ చేయాలన్న పశువులకు చాలా ఇబ్బంది అవుతున్నది దయచేసి పశువులకు ఇంజక్షన్ చేయడానికి స్టాండ్ ఏర్పాటు చేయాలని కోరడం జరిగినది ఎమ్మార్వో ఎంపీడీవో సానుకూలంగా స్పందించడం జరిగినది ఉసిరికాయలపల్లి పంచాయతీకి పెండింగ్ బిల్లులు రావలసిన బిల్లులు కూడా సకాలంలో ప్రభుత్వం తరఫున తీసుకురావాలని కోరడమైనది ఈ సభలో వివిధ రాజకీయ పార్టీల నాయకులు అంగన్వాడి టీచర్స్ సిబ్బంది హెల్త్ వర్కర్లు పంచాయతీ సిబ్బంది ప్రజలు ముఖ్య నాయకులు పాల్గొన్నారు.