జైపూర్ ఎస్టిపిపిలో ఘనంగా నిర్వహించిన డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ జయంతి వేడుకలు

జైపూర్, నేటి ధాత్రి:

మంచిర్యాల జిల్లా జైపూర్ మండల కేంద్రంలోని సింగరేణి థర్మల్ పవర్ ప్లాంట్ లో ఆదివారం రోజున
భారతరత్న డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ 133వ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ముఖ్యఅతిథిగా విచ్చేసిన ఎస్టిపీపి ఈడి శ్రీ బసివి రెడ్డి ఇతర అధికారులు మరియు ఉద్యోగులతో కలిసి ఉదయం 7 గంటలకు ఎస్టిపిపి నుండి బైక్ ర్యాలీతో పెగడపల్లి వరకు వెళ్లి అక్కడ అంబేద్కర్ విగ్రహానికి పాలాభిషేకం చేసి, పూలమాలలతో నివాళులర్పించారు. అనంతరం ఆడిటోరియం వద్దకు చేరుకొని పతాక ఆవిష్కరణ చేశారు. తర్వాత నిర్వహించిన కార్యక్రమంలో జ్యోతి ప్రజ్వలన చేసి అంబేద్కర్ చిత్రపటానికి పూలమాలలు సమర్పించారు. అలాగే ఈ సందర్భంగా కేక్ కట్ చేయడం జరిగింది.ఈ సందర్భంగా ఈడీ బసివి రెడ్డి మాట్లాడుతూ అంబేద్కర్ రాజ్యాంగ శిల్పి , సామాజిక, ఆర్థిక వేత్తయని, బహుముఖ ప్రజ్ఞాశాలి అని, సమసమాజ నిర్మాణం కోసం నిరంతరం కృషి చేసిన వ్యక్తియని కొనియాడారు. అంబేద్కర్ అనేక వివక్షలకు గురి అవుతు కూడా అవమానాలకు కృంగిపోకుండా ఆ కసినీ మెట్లుగా ఉపయోగించుకొని తాను రెండు పిఎచ్ డి లను పొంది,64 సబ్జెక్టులలో మాస్టర్స్ సాధించి, సమాజ అభివృద్ధికై కృషి చేశారని, అంటరానితనాన్ని నిర్మూలించడానికి విద్య ఒక్కటే మార్గం అని సూచించారనీ అన్నారు. అలాగే విద్యను ప్రోత్సహించండి అదే వారి అభివృద్ధికి తోడ్పడుతుందని ఈడి అన్నారు. నిన్న ఎస్టిపిపిలో జరిగిన బ్లడ్ డొనేషన్ క్యాంపులో 121 మంది రక్తదానం చేశారని ప్రశంసించారు. సమాజంలో సమానంగా గౌరవించాలని పిలుపునిచ్చారు.అనంతరం వక్తలు మాట్లాడుతూ అంబేద్కర్ విశ్వవైతాలికుడు అనగా సమాజాన్ని మేల్కొల్పేవాడు అన్నారు. అంబేద్కర్ భారత రాజ్యాంగ పితామహుడు అని, బలహీన వర్గాల అభ్యున్నతికి ఎంతో కృషి చేశారని తెలిపారు. అలాగే అంబేద్కర్ రాజకీయ అధికారం లేకుంటే ఏ సామాజిక వర్గం అభివృద్ధి చెందలేదని అన్నారని తెలిపారు. ఐక్యరాజ్యసమితిలో కూడా అంబేద్కర్ జయంతిని జరుపుకుంటున్నారని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో జైపూర్ లోని జడ్పీహెచ్ఎస్ స్కూల్ విద్యార్థులకు మరియు ఎస్టిపిపి ఉద్యోగులకు నిర్వహించిన క్విజ్, వ్యాసరచన మరియు డ్రాయింగ్ కాంపిటీషన్లో గెలుపొందిన వారికి బహుమతులు ప్రధానం చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో సేవా సమితి అధ్యక్షురాలు భవాని, ఈడి బసివి రెడ్డి , చీఫ్ ఆఫ్ (ఓ అండ్ ఎం ) శ్రీ జే ఎన్ సింగ్, ఏజీ ఎం (సివిల్ ) శ్రీ ప్రసాద్, ఏజీఎం( ఫైనాన్స్) శ్రీ సుధాకర్, ఏజీఎం (ఎఫ్జీడి) శ్రీ రమణ డీజీఎం శ్రీ మదన్మోహన్, ఎస్టీ ఎంప్లాయిస్ అధ్యక్షులు డి. పంతులు, ఎస్సీ లైసెనింగ్ ఆఫీసర్ శ్రీ వెంకటయ్య, ఎస్టి లైజనింగ్ ఆఫీసర్ శ్రీ బీమా, సి ఎం ఓఏఐ తరఫున శ్రీ సంతోష్ కుమార్, ఏఐటీయూసీ పిట్ సెక్రటరీ సత్యనారాయణ రెడ్డి,పర్సనల్ మేనేజర్ శ్రీ రామశాస్త్రి, పవర్ మేక్ ప్లాంట్ హెడ్ శ్రీ అఖిల్ కపూర్ ఇతర అధికారులు ,ఉద్యోగులు మరియు స్కూల్ విద్యార్థులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!