
ఢిల్లీ జంతర్ మంతర్ ధర్నాలో పాల్గొన్న జైపూర్ మండలం కాంగ్రెస్ నాయకులు
జైపూర్,నేటి ధాత్రి:
ఢిల్లీ జంతర్ మంతర్ ధర్నాలో పాల్గొన్న జైపూర్ మండలం కాంగ్రెస్ నాయకులు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఆమోదించిన 42% బీసీ రిజర్వేషన్ బిల్లుకు రాష్ట్రపతి ఆమోదం పొందేందుకు కేంద్రాన్ని ఒత్తిడి చేయడం లక్ష్యంగా ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద నిర్వహించిన బిసి రిజర్వేషన్ సాధన ధర్నాలో చెన్నూర్ నియోజకవర్గంలోని జైపూర్ మండలం కాంగ్రెస్ నాయకులు, బీసీ నాయకులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ నాయకులు మాట్లాడుతూ.. బీసీల ఆత్మగౌరవ గర్జన అని, బీసీలకు తగిన రిజర్వేషన్లు కల్పించకపోవడం రాజ్యాంగ స్పూర్తికి విరుద్ధమన్నారు. 52% బీసీ జనాభా ఉన్నప్పటికీ వారికి విద్య,ఉద్యోగాల్లో సరైన రిజర్వేషన్లు కల్పించలేదని విమర్శించారు.బీసీ సామాజిక న్యాయం కోసం ఢిల్లీకి వచ్చామని కాంగ్రెస్ నాయకులు ఉన్నారు.